New Army Chief : కొత్త ఆర్మీ చీఫ్‌గా ఉపేంద్ర ద్వివేది.. ఆయన నేపథ్యమిదీ

లెఫ్టినెంట్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేదికి కేంద్ర ప్రభుత్వం కీలక అవకాశం కల్పించింది.

  • Written By:
  • Publish Date - June 12, 2024 / 07:49 AM IST

New Army Chief : లెఫ్టినెంట్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేదికి కేంద్ర ప్రభుత్వం కీలక అవకాశం కల్పించింది. ఆయనను భారత ఆర్మీ కొత్త అధిపతిగా నియమించింది. ఈయన ఇప్పటివరకు ఆర్మీ స్టాఫ్‌ వైస్‌ చీఫ్‌గా వ్యవహరించారు. 2022 ఏప్రిల్‌ 30 నుంచి భారత ఆర్మీ చీఫ్‌‌గా వ్యవహరిస్తున్న జనరల్‌ మనోజ్‌ సి.పాండే ఈనెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో ఉపేంద్ర ద్వివేది(New Army Chief) బాధ్యతలను చేపట్టనున్నారు.

We’re now on WhatsApp. Click to Join

ఉపేంద్ర ద్వివేది గురించి.. 

  • 1964లో ఉపేంద్ర ద్వివేది మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో జన్మించారు.
  • రేవా సైనిక్‌ స్కూల్‌లో ఆయన పాఠశాల విద్య అభ్యసించారు.
  • నేషనల్‌ డిఫెన్స్‌ కాలేజీ, యూఎస్‌ ఆర్మీ వార్‌ కళాశాలలో చదువుకున్నారు.
  • డిఫెన్స్‌, మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌లో ఎంఫిల్‌ చేశారు.
  • స్ట్రాటజిక్‌ స్టడీస్‌, మిలిటరీ స్టడీస్‌లో రెండు మాస్టర్‌ డిగ్రీలు చేశారు.
  • ఈయన 1984లో  జమ్మూకశ్మీర్‌ రైఫిల్స్‌లో చేరారు.
  • ఆర్మీలో ఇప్పటివరకు పలు కీలక పాత్రలు పోషించారు.
  • కశ్మీర్‌ వ్యాలీ, రాజస్థాన్‌ సెక్టార్‌లోనూ కమాండర్ స్థాయిలో సేవలు అందించారు.
  • అసోం రైఫిల్స్‌ ఐజీగానూ పనిచేశారు.
  • డైరెక్టర్‌ జనరల్‌ ఇన్‌ఫాంట్రీ హోదాలో, నార్తర్న్‌ కమాండ్‌ జనరల్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఇన్‌ చీఫ్‌గానూ సేవలు అందించారు.
  • ఆర్మీకి అందించిన సేవలకుగానూ ఉపేంద్ర ద్వివేదికి పరమ విశిష్ట సేవా, అతి విశిష్ట సేవా పతకాలు వచ్చాయి.

Also Read : Chandrababu : జగన్ కు ఫోన్ చేసిన చంద్రబాబు