Loud Blast : ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంలో పేలుడు సౌండ్స్ ?

Loud Blast : ఢిల్లీలో మంగళవారం రాత్రి కలకలం రేగింది. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం దగ్గర పేలుడు శబ్దాలు వినిపించాయంటూ ఢిల్లీ పోలీసులకు ఒక ఫోన్ కాల్ వచ్చింది.

  • Written By:
  • Updated On - December 27, 2023 / 07:34 AM IST

Loud Blast : ఢిల్లీలో మంగళవారం రాత్రి కలకలం రేగింది. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం దగ్గర పేలుడు శబ్దాలు వినిపించాయంటూ ఢిల్లీ పోలీసులకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. దీంతో హుటాహుటిన డాగ్ స్క్వాడ్, క్రైమ్ బ్రాంచ్  టీమ్, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌తో పాటు ఢిల్లీ పోలీసుల టీమ్ సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. వెంటనే ఫోరెన్సిక్ లేబొరేటరీ నిపుణులు అక్కడికి చేరుకున్నారు. అయితే  ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం పరిసరాల్లో పేలుడు పదార్థాలేవీ లభించలేదు. కార్యాలయానికి కొద్ది మీటర్ల దూరంలో ఉన్న ఖాళీ స్థలంలో.. ఇజ్రాయెల్ రాయబారిని ఉద్దేశించి రాసిన లేఖ ఒకటి పోలీసులకు లభ్యమైంది. ఈ లేఖతో పాటు ఒక దేశానికి చెందిన జెండా చుట్టి ఉందని అంటున్నారు.  వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు బృందాలు ఆ ప్రాంతంలో క్షుణ్ణంగా సోదాలు చేసి, సాక్ష్యంగా ఎగ్జిబిట్లను సేకరించి ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ ఘటనపై ఇజ్రాయెల్ డిప్యూటీ రాయబారి ఒహాద్ నకాష్ కయ్నార్ వీడియో సందేశం విడుదల చేశారు. ‘‘మంగళవారం సాయంత్రం 5 గంటల తర్వాత రాయబార కార్యాలయానికి సమీపంలో పేలుడు సంభవించింది. మా ఆఫీసులో పనిచేసే వారంతా సురక్షితంగా ఉన్నారు. మా దౌత్యవేత్తలు సురక్షితంగా ఉన్నారు. మా భద్రతా బృందాలు పనిచేస్తున్నాయి’’ అని తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో సెంట్రల్ ఢిల్లీలోని పహర్‌గంజ్ ప్రాంతంలోని చాబాద్ హౌస్ వద్ద పోలీసులు భద్రతను పెంచారు. యూదు కమ్యూనిటీ సెంటర్ చుట్టూ భద్రతా వలయం ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ద్వారా పోలీసులు ఆ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తున్నారు.

Also Read: TSRTC : పురుషులకు ప్రత్యేక బస్సులు.. ఇతర బస్సుల్లో 25 సీట్లు రిజర్వ్ ?

ముంబైలో 11 బాంబులు పెట్టామంటూ..

11 బాంబులను పెట్టామంటూ ముంబైలోని  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయానికి బెదిరింపు మెయిల్ వచ్చింది. ఆర్​బీఐ కేంద్ర కార్యాలయం సహా ఐసీఐసీఐ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకుల కార్యాలయాల్లో బాంబులు అమర్చినట్లు ఈమెయిల్​లో దుండగులు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం 10.50 గంటల సమయంలో ఖిలాఫత్ డాట్ ఇండియా(ఎట్ జీమెయిల్) అనే ఐడీ నుంచి ఈమెయిల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్​ తమ పదవులకు రాజీనామా చేయాలని బెదిరించారు. బ్యాంకింగ్ స్కామ్​కు సంబంధించి పూర్తి వివరాలను విడుదల చేయాలని పేర్కొన్నారు. అయితే, సంబంధిత ప్రదేశాల్లో తనిఖీ చేశామని, ఎలాంటి అనుమానిత వస్తువులు దొరకలేదని పోలీసులు స్పష్టం చేశారు.