Northeast Result : ఈశాన్య భారతదేశంలో ఈసారి కమలం మునుపటిలా వికసించలేకపోయింది. ఈదఫా ఇండియా కూటమి, ఇతర ప్రాంతీయ పార్టీల నుంచి బీజేపీకి బలమైన పోటీ ఎదురవుతోంది. దీంతో అరుణాచల్‌ప్రదేశ్, త్రిపుర మినహా మిగతా ఆరు ఈశాన్య భారత రాష్ట్రాల్లో బీజేపీ(Northeast Result) ఆశించినంతగా రాణించలేకపోయింది.
We’re now on WhatsApp. Click to Join
- అరుణాచల్ ప్రదేశ్‌లోని 2 లోక్‌సభ స్థానాల్లోనూ ఎన్డీయే కూటమి దూసుకుపోతోంది. త్రిపురలోని 2 స్థానాల్లోనూ ఎన్డీయే కూటమి హవా కనిపిస్తోంది.
- మేఘాలయలో కాంగ్రెస్ 1 చోట, ఇతరులు 1 చోట లీడ్‌లో ఉన్నారు.
- మిజోరంలో ఉన్న ఏకైక లోక్‌సభ స్థానంలో జెడ్‌పీఎం పార్టీ స్పష్టమైన లీడ్‌లో ఉంది.
- నాగాలాండ్‌లోని ఏకైక లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన లీడ్‌లో ఉంది.
- సిక్కింలోని ఏకైక లోక్‌సభ స్థానంలో ఎస్‌కేఎం పార్టీ స్పష్టమైన లీడ్‌లో ఉంది.
- అసోంలోని 2 లోక్‌సభ స్థానాలకుగానూ ఒకచోట ఎన్డీయే, మరోచోట విపక్ష ఇండియా కూటమి లీడ్‌లో ఉన్నాయి.
- మణిపూర్‌లోని 2 లోక్‌సభ స్థానాలకుగానూ 1 చోట ఇండియా కూటమి లీడ్‌లో ఉంది. మరో చోట ఎన్డీయే కూటమి అభ్యర్థి లీడ్‌లో దూసుకుపోతున్నారు.