హిందూ దేవుళ్లలో బ్రాహ్మణులు ఎవరూ లేరని, శివుడు దళితుడని ఢిల్లీ యూనివర్సిటీ వైఎస్ ఛాన్సలర్ ధూళిపూడి శాంతిశ్రీ పండిట్ తేల్చేశారు. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలపై హిందూవాదులు ఫైర్ అవుతున్నారు. హిందూ దేవుళ్లు ఎవరూ అగ్రకులాల వాళ్లు లేరని, ఎక్కువగా క్షత్రియులు ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేయడం దుమారాన్ని రేపుతోంది.కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్ అంబేద్కర్ ఉపన్యాస శ్రేణిలో ఆమె ప్రసంగించారు. దేవుళ్ల మూలాన్ని మనుధర్మ శాస్త్రపరంగా, శాస్త్రోక్తంగా పరిశీలిస్తే ఏ దేవుడూ బ్రాహ్మణుడు కాదన్నారు. అత్యున్నతమైనది క్షత్రియుడుగా తేల్చారు.
శ్మశాన వాటికలో పాముతో కూర్చున్న శివుడు తప్పనిసరిగా షెడ్యూల్డ్ కులాలు లేదా షెడ్యూల్డ్ తెగలకు చెందినవాడని ఆమె అన్నారు. శివుడు చాలా తక్కువ బట్టలు కూడా ధరించి ఉంటారు. `బ్రాహ్మణులు స్మశాన వాటికలో కూర్చుంటారని తాను అనుకోను. అందువల్ల దేవతలు మానవ శాస్త్రపరంగా ఉన్నతమైన జీవి నుండి వచ్చినవారు కాదని చెప్పవచ్చు. ఇందులో లక్ష్మి, శక్తి మొదలైన దేవతలందరూ ఉన్నారు. జగన్నాథుడు గిరిజనుడు అప్పుడు కూడా మనం వివక్ష చూపుతున్నాం, ఇది చాలా అమానవీయం` అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
`మనుస్మృతిలో ప్రతి స్త్రీని శూద్ర అంటారు. ఒక స్త్రీ బ్రాహ్మణురాలిగా లేదా మరేదైనా క్లెయిమ్ చేసుకోదు. వివాహం మీకు భర్త లేదా తండ్రి హోదాను ఇస్తుందని నేను నమ్ముతున్నాను. ఇది అసాధారణంగా వెనుకబడి ఉంటుందని నేను భావిస్తున్నాను.` అని శాంతి అన్నారు. కులం పుట్టుకపై ఆధారపడి లేదని చాలా మంది చెబుతారని, కానీ నేడు అది పుట్టుకపై ఆధారపడి ఉందని పండిట్ చెప్పారు. `బ్రాహ్మణుడు, మరో కులం చెప్పులు కుట్టేవాడు అయితే ఒక్కసారిగా దళితుడు కాగలడా? అది కుదరదు. ఇటీవల రాజస్థాన్‌లో ఒక దళిత పిల్లవాడిని ముట్టుకునందుకు కొట్టారు, అది కూడా తాకలేదు, అగ్రవర్ణాల నీళ్ళు కూడా బ్రాహ్మణుడు తాగరు. మానవ హక్కుల సమస్య అని అర్థం చేసుకోండి`. అంటూ ఆమె వాపోయారు.
కులాన్ని నిర్మూలించాలి: పండిట్
భారతీయ సమాజం బాగుపడాలంటే కుల నిర్మూలన అవసరమని ఆమె అన్నారు. ఇంత వివక్ష మరియు అసమానమైన గుర్తింపు పట్ల మనం ఎందుకు మక్కువ చూపుతున్నామో నాకు అర్థం కాలేదు. ఈ కృత్రిమ గుర్తింపు అని పిలవబడే రక్షణ కోసం మేము ఎవరినైనా చంపడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. పరమశివుడు కూడా ఎస్సీ లేదా ఎస్టీకి చెంది ఉండొచ్చన్నారు. ఇటీవల చోటుచేసుకున్న మత హింస ఘటనలపై ఆమె స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. మనుస్మృతి ప్రకారం మహిళలు అందరూ శూద్రులే. ఏ ఒక్క మహిళ కూడా తను బ్రాహ్మణ స్త్రీ అని చెప్పుకోవడానికి లేదు. వివాహం ద్వారా భర్త కులం వస్తుంది. ఇది తిరోగమం కలిగించే విషయంగా నమ్ముతున్నాను’’ అని శాంతిశ్రీ అన్నారు. మానవ శాస్త్ర పరంగా లక్ష్మీ, శక్తి లేదా జగన్నాథ్ అగ్ర కులాలకు చెందిన వారు కాదన్నారు. జగన్నాథ్ గిరిజన జాతికి చెందినవాడిగా పేర్కొన్నారు. ‘‘కనుక ఎందుకు మనం వివక్షను కొనసాగిస్తున్నాం? ఇది ఎంతో అమానవీయం’’ అని ఆమె అన్నారు.
