Site icon HashtagU Telugu

prajwal : ప్రజ్వల్‌ రేవణ్ణకు మరోసారి లుకౌట్‌ నోటీసు

Lookout notice for Prajwal Revanna once again

Lookout notice for Prajwal Revanna once again

prajwal revanna: కర్ణాటక సెక్స్‌ స్కాండల్‌ కేసులో మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ మనవడు, జేడీయూ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణకు మరోసారి లుకౌట్‌ నోటీసులు(Lookout notices) జారీ అయ్యాయి. విచారణకు హాజరుకావాలని తాజా సమన్లలో ఆదేశించింది. విచారణకు హాజరుయ్యేందుకు ఏడు రోజుల సమయం కావాలని ప్రజ్వల్‌ పెట్టుకున్న అభ్యర్థనను సిట్‌ కొట్టిపారేసింది. ప్రజ్వల్‌ రేవణ్ణకు చెందిన ఆశ్లీల వీడియోలకు చెందిన కేసును సిట్‌ దర్యాప్తు చేపడుతున్న విషయం తెలిసిందే. కాగా, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ మహిళ ఆరోపించడంతో దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేగింది.పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం విదేశాల్లో ఆయనకు లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి.

We’re now on WhatsApp. Click to Join.

2019లో హాసన్ లోక్‌సభ స్థానం నుంచి గెలిచిన ప్రజ్వల్ రేవణ్ణ ఈసారి కూడా అదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర మాట్లాడుతూ.. లైంగిక వేధింపుల కేసును విచారించే ప్రత్యేక దర్యాప్తు బృందం ముందు రేవణ్ణ త్వరగా హాజరుకావాలని, అతను హాజరుకాకపోతే అరెస్టు చేసే అవకాశం ఉందని సూచించారు. ఇదిలా ఉంటే రేవణ్ణ ఇంట్లో వంట మనిషిగా పనిచేశానని చెప్పిన మహిళ.. జేడీఎస్ ఎంపీ తన కూతురిని వీడియో కాల్స్ ద్వారా వేధిస్తున్నాడని ఆరోపించింది. ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన భారీ విజువల్స్ ఇంటర్నెట్‌లో చక్కర్లు కొట్టాయి.

Read Also: Covishield Row: వ్యాక్సిన్ సర్టిఫికెట్ల నుంచి ప్రధాని ఫొటో మిస్సింగ్.. ఎందుకో చెప్పిన కేంద్రం ?

మరోవైపు ఎన్నికల సీజన్‌లో ఈ ఆరోపణలు రాజకీయ దుమారం రేపాయి. ఎన్నికల కోసం జేడీఎస్.. బీజేపీతో పొత్తు పెట్టుకుంది, ప్రజ్వల్ రేవణ్ణపై వచ్చిన ఆరోపణలతో బీజేపీపై కాంగ్రెస్ సర్వత్రా దాడికి దిగింది. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.

Read Also:  Pawan Kalyan : ప్రశాంతత కోసం పవన్ కళ్యాణ్ ఎలాంటి సినిమాలు చూస్తారో తెలుసా..?

ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించి అశ్లీల వీడియోల పెన్‌డ్రైవ్ తీవ్ర కలకలం రేపింది. వందలాది వీడియోలు దాంట్లో ఉన్నాయి. పలువురి అమ్మాయిలతో ప్రజ్వల్ ఉన్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి. ఇక మహిళా సంఘాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయి. నిందితుడ్నికఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి.