Site icon HashtagU Telugu

Loksabha Elections : ఆరో జాబితా విడుద‌ల‌ చేసిన బీజేపీ

Lok Sabha polls.. BJP releases sixth list of three candidates

Lok Sabha polls.. BJP releases sixth list of three candidates

Loksabha Elections 2024 : రానున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్ధుల‌తో కూడిన ఆరో జాబితా(Sixth list)ను బీజేపీ(bjp) మంగ‌ళ‌వారం విడుద‌ల చేసింది. ఈ జాబితాలో రాజ‌స్ధాన్‌(Rajasthan), మ‌ణిపూర్(Manipur)రాష్ట్రాల‌కు చెందిన ముగ్గురు అభ్య‌ర్ధుల‌కు చోటు క‌ల్పించింది. రాజ‌స్ధాన్‌లోని దౌసా నియోజ‌కవ‌ర్గం నుంచి క‌న్హ‌య్య లాల్ మీనా, క‌రౌలీ-ధోల్పూర్ నుంచి ఇందూ దేవి జాట‌వ్‌ల‌ను బ‌రిలో నిలిపింది.

ఇక రాజ‌స్ధాన్‌లో 25 లోక్‌స‌భ స్ధానాలుండ‌గా ఏప్రిల్ 19న తొలి ద‌శ‌లో 12 స్ధానాల‌కు పోలింగ్ జ‌రుగుతుంది. మిగిలిన 13 స్ధానాల్లో ఏప్రిల్ 26న రెండో ద‌శ‌లో పోలింగ్ జ‌రుగుతుంది. ఇన్న‌ర్ మ‌ణిపూర్ లోక్‌స‌భ స్ధానం నుంచి బ‌సంత కుమార్ సింగ్ పేరును బీజేపీ ఈ జాబితాలో ప్ర‌క‌టించింది. మ‌ణిపూర్‌లో ఏప్రిల్ 19, 26 తేదీల్లో రెండు ద‌శ‌ల్లో పోలింగ్ జ‌ర‌గ‌నుంది.

We’re now on WhatsApp. Click to Join.

మ‌రోవైపు కాంగ్రెస్ రాజ‌స్ధాన్‌, త‌మిళ‌నాడు నుంచి పోటీ చేసే ఐదుగురు అభ్య‌ర్ధుల‌తో సోమ‌వారం ఆరో జాబితాను విడుద‌ల చేసింది. దీంతో కాంగ్రెస్ ఇప్ప‌టివ‌ర‌కూ 190 నియోజ‌క‌వ‌ర్గాల‌కు అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించ‌గా, బీజేపీ ఇప్ప‌టివ‌ర‌కూ 405 లోక్‌స‌భ స్ధానాల్లో పోటీ చేసే అభ్య‌ర్ధుల‌ను వెల్ల‌డించింది. కాగా 543 లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఏప్రిల్ 19 నుంచి ఏడు ద‌శ‌ల్లో పోలింగ్ జ‌ర‌గ‌నుంది. దేశ‌వ్యాప్తంగా దాదాపు 97 కోట్ల మంది ఓట‌ర్లు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకోనున్నారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేప‌ట్టి ఫ‌లితాలు ప్ర‌క‌టిస్తారు.

Read Also: Phone Tapping Issue: రేవంత్ అరెస్ట్ కు ఫోన్ ట్యాపింగే కారణం: రఘునందన్ రావు

 

Exit mobile version