Lok Sabha Polls 2024: అప్ ఎన్నికల ప్రచార గీతానికి ఈసీ బ్రేకులు

ఢిల్లీ అధికర పార్టీ ఆప్ ఎన్నికల ప్రచార గీతాన్ని ప్రారంభించింది. ఆమ్ ఆద్మీ పార్టీ తన ఎన్నికల ప్రచార గీతం 'లగే రహో కేజ్రీవాల్'ను శనివారం ప్రారంభించింది. అయితే ఈసీ ఆ పాటకు బ్రేకులు వేసింది.

Lok Sabha Polls 2024: ఎన్నికల వేళ రాజకీయ పార్టీల పాటలు కీలకంగా మారాయి. గడిచిన రోజులను గుర్తు చేస్తూ పాటలను పార్టీలు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రజల్ని ప్రభావితం చేసే పాటల్నే పార్టీలు ప్రచార అస్త్రంగా ఎంచుకున్నాయి. ప్రజాక్షేత్రంలో పాటలతో మార్మోగిస్తున్నాయి. మైకుల మోతలతో ప్రచారం హోరెత్తుతున్నాయి. తక్కువ సమయంలో ఎక్కువగా ప్రభావితం చేయాలంటే కొన్ని రాజకీయ పార్టీలు ప్రచార గీతాలపై ఆధారపడుతున్నాయి. తాజాగా ఢిల్లీ అధికర పార్టీ ఆప్ ఎన్నికల ప్రచార గీతాన్ని ప్రారంభించింది. ఆమ్ ఆద్మీ పార్టీ తన ఎన్నికల ప్రచార గీతం ‘లగే రహో కేజ్రీవాల్’ను శనివారం ప్రారంభించింది.

రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్, అతిషి మరియు పంకజ్ గుప్తాలతో సహా పార్టీ సీనియర్ నాయకుల సమక్షంలో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ప్రారంభించిన ఈ పాట ఢిల్లీ ప్రజల జీవితాలను సులభతరం చేయడంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పట్టుదల గురించి పాటలో ఉంది. అయితే ఈసీ ఆ పాటకు బ్రేకులు వేసింది.

We’re now on WhatsAppClick to Join

లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్నికల సంఘం నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వాస్తవానికి పార్టీ ప్రచార గీతాన్ని కమిషన్ నిషేధించింది. ఇటీవలే ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల ప్రచార ప్రచార గీతాన్ని ప్రారంభించింది. ఈ రెండు నిమిషాల ప్రచార పాటలో అరవింద్ కేజ్రీవాల్ మరియు మనీష్ సిసోడియాని హైలెట్ చేస్తూ రాశారు . ఈ పాటను ఆ పార్టీ ఎమ్మెల్యే దిలీప్ పాండే రాశారు. దీంతో ఎన్నికల కమిషన్ చర్యలకు పాల్పడింది. మరోవైపు ఈ చర్యను కేంద్రం నియంతృత్వమని ఆప్ పేర్కొంది.

ప్రచార గీతంలో ఎక్కడా బీజేపీ ప్రస్తావన లేదని ఆప్ సీనియర్ నేత, మంత్రి అతిశి అన్నారు. ఈ పాటలో ఎక్కడా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించలేదని ఆమె పేర్కొంది.

Also Read: WHO : 2023లో 88 శాతం పెరిగిన గ్లోబల్ మీజిల్స్ కేసులు