BJP : పంజాబ్‌లో ఖాతా తెరవని బీజేపీ

  • Written By:
  • Publish Date - June 4, 2024 / 12:09 PM IST

Election Results 2024: బీజేపీకి పంజాబ్‌ ఓటర్లు షాకిచ్చారు. రాష్ట్రంలో మొత్తం 13 స్థానాల్లో ఆ పార్టీ పోటీచేసిన ఒక్క చోట కూడా ఖాతా తెరవలేకపోయింది. కాంగ్రెస్‌ 7 చోట్ల ఆధిక్యంలో ఉండగా, 3 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇకపోతే శిరోమణి అకాలీదళ్‌ ఒక స్థానంలో, ఇండిపెండెంట్లు 2 చోట్ల లీడ్‌లో ఉన్నారు. రైతు చట్టాలు తీసుకొచ్చిన బీజేపీపై పంజాబ్‌ ఓటర్లు తీవ్ర ఆగ్రహంతో ఉండటంతో తాజా ఫలితాల్లో అది ప్రతిఫలిస్తున్నది.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, దేశవ్యాప్తంగా ఎన్డీఏ 296 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఇండియా కూటమి 226 చోట్ల లీడ్‌లో ఉన్నది. ఇప్పటివరకు ఇరు కూటములు ఒక్కో స్థానాల్లో విజయం సాధించాయి. ఇక ఇతరులు 19 స్థానాల్లో మెజార్టీలో ఉన్నారు.

Read Also: PM Modi : మోడీజీ ఇది ట్రైలర్.. జైరాం రమేష్ విమర్శలు