Site icon HashtagU Telugu

Lok Sabha Polls: లోక్‌సభ ఎన్నికల బరిలో బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో..?

.jpg

Lok Sabha Polls 2024.. Akshay Kumar from Chandni Chowk?

 

Lok Sabha Polls: లోక్‌సభ ఎన్నికలకు (Lok Sabha Polls) సమయం దగ్గరపడుతోంది. మరో పది రోజుల్లో కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ కూడా విడుదల చేసే అవకాశం ఉంది. దీంతో అన్ని పార్టీలు ఎన్నికలకు సమాయాత్తమవుతున్నాయి. ఇప్పటికే ప్రచారాన్ని కూడా మొదలు పెట్టేశాయి.

ఇక దేశరాజధాని ఢిల్లీలో లోక్‌సభ ఎన్నికలు రసవత్తరంగా మారబోతున్నాయి. అక్కడ అధికార ఆప్‌, కాంగ్రెస్‌ పార్టీల మధ్య పొత్తు కుదిరిన విషయం తెలిసిందే. ఢిల్లీలో మొత్తం 7 లోక్‌సభ స్థానాలు ఉండగా ఆప్‌ నాలుగింట్లో, కాంగ్రెస్‌ మూడింట్లో బరిలోకి దిగబోతోంది. గత ఎన్నికల్లో ఢిల్లీలోని 7 లోక్‌సభ స్థానాలను బీజేపీ(bjp) కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సారి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఆప్‌, కాంగ్రెస్‌ పార్టీలు పొత్తు కుదుర్చుకున్నాయి. కానీ, బీజేపీ సైతం ఈ ఎన్నికల్లో కూడా ఢిల్లీని క్లీన్‌స్వీప్‌ చేయాలని చూస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

ఢిల్లీలో ఆప్‌, కాంగ్రెస్‌కి గట్టి పోటీ ఇచ్చేందుకు ఏడు స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగానే ఓ లోక్‌సభ స్థానం నుంచి స్టార్‌ నటుడిని బరిలోకి దించాలని యోచిస్తున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. స్థానికతను దృష్టిలో ఉంచుకొని బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar)ని లోక్‌సభ బరిలో నిలపబోతోందని సమాచారం. చాందినీ చౌక్‌ (Chandni Chowk) నుంచి అక్షయ్‌ పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. ఈ అంశంపై ఇప్పటికే పార్టీ నేతలు అక్షయ్‌ను ఒకసారి సంప్రదించారని సదరు కథనాలు వెల్లడించాయి. అయితే, దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు.

read also : Nara Lokesh : మేం అధికారంలోకి రాగానే విహారికి పూర్తి సహకారం