Site icon HashtagU Telugu

Women’s Reservation Bill : మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం..ఆ ఇద్దరు మాత్రం వ్యతిరేకించారు

Lok Sabha Passes Women's Re

Lok Sabha Passes Women's Re

లోక్‌సభలో మహిళా బిల్లు(Women’s Reservation Bill)కు ఆమోదం లభించింది. మంగళవారం మహిళా బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టగా..బుధువారం ఈ బిల్లు ఫై చర్చ జరిగింది, అనంతరం బిల్లు ఫై ఓటింగ్ పద్ధతి చేపట్టారు. ఈ బిల్లుకు అనుకూలంగా 454 మంది లోక్ సభ సభ్యులు ఓటు వేయగా, ఇద్దరు ‘నో’ అని ఓట్ చేసినట్లుగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా (Om Birla) ప్రకటించారు. కొత్త పార్లమెంటు భవనంలో ప్రవేశపెట్టిన తొలి బిల్లు, పాసైన తొలి బిల్లు ఇదే కావడం విశేషం.

అంతకుముందు బిల్లు అసంపూర్తిగా ఉందని విపక్షాలు లోక్ సభ నుంచి వాకౌట్ చేశాయి. ఆ తర్వాత స్లిప్పుల ద్వారా ఓటింగ్ ప్రారంభం అయింది. కాగా బిల్లుకు అనుకూలంగా 454 ఓట్లు పడగా.. వ్యతిరేకంగా 2 ఓట్లు పడ్డాయి. వ్యతిరేకంగా ఓటు వేసిన వారిలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (MP Asaduddin Owaisi), ఔరంగాబాద్ ఎంఐఎం ఎంపీ ఇంతియాజ్ జలీల్ (MP Imtiyaz Jaleel) ఉన్నారు. ఇక బిల్లుపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amith Sha) సమాధానం ఇచ్చారు. 2029 ఎన్నికల్లోనే రిజర్వేషన్లు అమలు చేస్తామని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కొత్త శకానికి ఆరంభమని, మహిళా ప్రగతికి సంబంధించిన విజన్‌ను ప్రధాని మోదీ జి-20లో ఆవిష్కరించారని అన్నారు.

Read Also : Amit Shah: మహిళ బిల్లు ఆమోదంతో మహిళల సుదీర్ఘ పోరాటానికి తెరపడింది