Site icon HashtagU Telugu

Phase 6 Polling: ఆరో విడత పోలింగ్ షురూ.. బరిలో మేనకాగాంధీ, ఖట్టర్, ముఫ్తీ, కన్హయ్య

Lok Sabha Election Phase 6

Lok Sabha Election Phase 6

Phase 6 Polling:  లోక్‌సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్‌ ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. 6 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని  58 స్థానాల్లో ఈరోజు ఓట్ల పండుగ జరుగుతోంది. ఈ విడతలోనే హర్యానాలోని మొత్తం 10, ఢిల్లీలోని మొత్తం  7 లోక్‌సభ సీట్లకు ఎన్నిక జరుగుతోంది. ఒడిశాలోని 42 అసెంబ్లీ స్థానాలకు కూడా ఇవాళే పోలింగ్‌ను నిర్వహి స్తున్నారు. జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్-రాజౌరీ లోక్‌సభ స్థానానికి మూడో విడతలో భాగంగా మే 7న పోలింగ్‌ జరగాల్సి ఉండగా, కనెక్టివిటీకి సంబంధించిన లాజిస్టికల్, కమ్యూనికేషన్ వంటి అడ్డంకులు తలెత్తాయి. దీంతో ఇవాళ ఆ స్థానంలో ఓటింగ్ జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటివరకు మొత్తం 428 స్థానాలకు పోలింగ్ ముగిసింది. శనివారం 58 చోట్ల ఎన్నిక జరగనుంది. చివరిదైన ఏడో విడత జూన్ 1న జరగనుండగా, జూన్ 4న ఓట్ల లెక్కింపును నిర్వహిస్తారు.

We’re now on WhatsApp. Click to Join

హర్యానాలో కీలక అభ్యర్థులు వీరే..

హర్యానాలో బీజేపీ మొత్తం 10 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. కురుక్షేత్రను ఆమ్‌ ఆద్మీ పార్టీకి కేటాయించిన కాంగ్రెస్‌, మిగిలిన 9 స్థానాల్లో బరిలోకి దిగింది. ఈసారి కర్నాల్‌ నుంచి బీజేపీ తరఫున మాజీ సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్ బరిలో ఉన్నారు. గురుగ్రామ్‌ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌ తరఫున నటుడు రాజ్‌ బబ్బర్‌ బరిలో నిలిచారు. కురుక్షేత్ర లోక్‌సభ స్థానంలో ఈసారి బీజేపీ తరఫున నవీన్‌ జిందాల్ పోటీ చేస్తున్నారు. రోహ్‌తక్‌లో కాంగ్రెస్ నుంచి దీపేంద్ర హూడా పోటీలో ఉన్నారు.

Also Read :Water: ఉదయం నిద్రలేవగానే నీరు తాగుతున్నారా.. అయితే ఏం జరుగుతుందో తెలుసా

ఢిల్లీలో కీలక అభ్యర్థులు వీరే.. 

ఢిల్లీలోని న్యూఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి కేంద్ర మాజీ మంత్రి సుష్మ స్వరాజ్ కుమార్తె భన్సూరీ స్వరాజ్ పోటీ చేస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో బీజేపీ తరఫున మీనాక్షీ లేఖీ గెలిచారు. ఈశాన్య ఢిల్లీ స్థానం నుంచి బీజేపీ నేత మనోజ్ తివారీ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి కన్హయ్య కుమార్ పోటీ చేస్తున్నారు.

Also Read :Pakistan Squad: ఎట్ట‌కేల‌కు టీ20 ప్ర‌పంచ క‌ప్‌కు జ‌ట్టును ప్ర‌క‌టించిన పాకిస్థాన్‌.. ఐదుగురు కొత్త ఆట‌గాళ్ల‌కు ఛాన్స్‌..!