Phase 5 Polling : లోక్‌సభ ఎన్నికల ఐదో విడత పోలింగ్ మే 20న(సోమవారం) జరగనుంది. దేశంలోని ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలలోని 49 లోక్‌సభ స్థానాలలో ఓటింగ్ ప్రక్రియను నిర్వహించనున్నారు. మొత్తం 695 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎప్పటిలాగే సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ (Phase 5 Polling) ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది.
We’re now on WhatsApp. Click to Join
ఐదో విడత లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని 14 స్థానాలు, మహారాష్ట్రలోని 13 స్థానాలు, పశ్చిమ బెంగాల్‌లోని 7 స్థానాలు, బిహార్, ఒడిశాలలోని చెరో 5 స్థానాలు, జార్ఖండ్‌లోని 3 స్థానాలు, కశ్మీర్, లడఖ్‌లోని చెరో స్థానంలో పోలింగ్ జరగనుంది. ఐదో విడత ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ అత్యంత కీలకమైన స్థానం. ఇక్కడి నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. ఇంతకుముందు 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ స్థానం నుంచి కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ గెలిచారు. ఇక అమేథీ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ పోటీ చేస్తున్నారు.
Also Read :Hospital Airdrop : ఆకాశం నుంచి ఊడిపడిన హాస్పిటల్.. ఎలా ?
ఐదో విడతలో కీలక అభ్యర్థులు వీరే..
- రాహుల్ గాంధీ (కాంగ్రెస్/ఇండియా): రాయ్ బరేలీ
- దినేష్ ప్రతాప్ సింగ్ (బీజేపీ/ఎన్డీయే): రాయ్ బరేలీ
- స్మృతి ఇరానీ (బీజేపీ/ఎన్డీయే): అమేథీ
- కిషోరి లాల్ శర్మ (కాంగ్రెస్/భారతదేశం): అమేథీ
- రాజ్‌నాథ్ సింగ్ (బీజేపీ/ఎన్డీయే): లక్నో
- పీయూష్ గోయల్ (బీజేపీ/ఎన్డీయే): ముంబై నార్త్
- చిరాగ్ పాశ్వాన్ (ఎల్జేపీ/ఎన్డీయే): హాజీపూర్
- కరణ్ భూషణ్ సింగ్ (బీజేపీ/ఎన్డీయే): కైసర్‌గంజ్
- రాజీవ్ ప్రతాప్ రూడీ (బీజేపీ/ఎన్డీయే): శరణ్
- రోహిణి ఆచార్య (ఆర్జేడీ/ఇండియా): శరణ్
- ఒమర్ అబ్దుల్లా (జేకేఎన్సీ/ఇండియా): బారాముల్లా
- అరవింద్ సావంత్ (ఎస్‌ఎస్ యూబీటీ/ఇండియా): ముంబై సౌత్
Also Read :Neeraj Chopra: చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా.. గోల్డ్ మెడల్ కొట్టాడు..!
లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన మొదటి నాలుగు విడతల పోలింగ్ ఏప్రిల్ 19, 26, మే 7, 13 తేదీల్లో జరిగింది. ఐదో విడత పోలింగ్ సోమవారం రోజు జరగనుంది. చివరి రెండు దశల పోలింగ్ మే 25, జూన్ 1 తేదీల్లో జరుగుతుంది. జూన్ 4న 542 లోక్‌సభ స్థానాలకు ఓట్ల లెక్కింపు జరగనుంది.