Site icon HashtagU Telugu

Lok Sabha Elections : లోక్‌‌సభ ఎన్నికల 4 దశల్లో భారీగా 67 శాతం ఓటింగ్​

Polling

Polling

Lok Sabha Elections : లోక్‌ సభ ఎన్నికల తొలి నాలుగు దశల పోలింగ్‌కు సంబంధించిన కీలక వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. తొలి నాలుగు విడతలలో జరిగిన ఎన్నికల్లో  66.95 శాతం పోలింగ్ నమోదైందని గురువారం ప్రకటించింది. ఈ నాలుగు దశల్లో 97కోట్ల మంది ఓటర్లలో 45.10 కోట్ల మంది ఓటు వేశారని తెలిపింది.  వచ్చే మూడు విడతల్లో పెద్దసంఖ్యలో ఓట్లు వేయాలని ప్రజలకు ఈసీ విజ్ఞప్తి చేసింది. ‘‘అధిక శాతం ఓటింగ్ నమోదు కావడం అనేది భారత ప్రజాస్వామ్యం బలం గురించి ప్రపంచానికి ఓటరు ఇచ్చిన సందేశం.ఈసీ అభ్యర్థన మేరకు పలు సంస్థలు, సినీ నటులు, ప్రముఖులు ఓటు హక్కు గురించి ఓటరుకు అవగాహన కల్పిస్తుండటం చాలా మంచి విషయం. ఓటింగ్ రోజు సెలవు దినం కాదు. ఓటర్లు ఓటు వేసి గర్వించాల్సిన రోజు. మిగతా మూడు విడతల్లో భారీగా పోలింగ్ జరగాలి’’ అని  కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్  ప్రజలకు పిలుపునిచ్చారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నాలుగు దశల్లో 379 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మే 20న ఐదో దశ, మే 25న ఆరోదశ, జూన్ 1న ఏడో దశ పోలింగ్(Lok Sabha Elections) జరగనుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

We’re now on WhatsApp. Click to Join

Also Read :Laya : అమెరికాలో అడుక్కుతింటు బ్రతుకుతుందనే వార్తలపై లయ క్లారిటీ..