Amit Shah : గాంధీనగర్‌ నుండి అమిత్‌ షా ఘన విజయం

Election Results 2024: ఎన్టీఏ కూటమికి తొలి విజయం నమోదయింది. కేంద్రహోంమత్రి, బీజేపీ సీనియర్‌ నేత అమిత్‌ షా ఘన విజయం సాధించారు. గుజరాత్‌ లోని గాంధీనగర్‌ నుంచి పోటీ చేసిన అమిత్‌షా తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌ అభ్యర్థి సోనాల్‌ రమణ్‌ భాయి పటెల్‌ మీద 4.10 లక్షల ఓట్ల భారీ మెజారీతో గెలుపొందారు. అమిత్ షాకు మొత్తంగా 5.26 లక్షల ఓట్లు పోలవగా.. ఆయన ప్రత్యర్థి రమణ్ భాయి పటేల్ కు 1.15 లక్షల […]

Published By: HashtagU Telugu Desk
1111

Lok Sabha Elections.. Amit Shah Wins Gandhinagar

Election Results 2024: ఎన్టీఏ కూటమికి తొలి విజయం నమోదయింది. కేంద్రహోంమత్రి, బీజేపీ సీనియర్‌ నేత అమిత్‌ షా ఘన విజయం సాధించారు. గుజరాత్‌ లోని గాంధీనగర్‌ నుంచి పోటీ చేసిన అమిత్‌షా తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌ అభ్యర్థి సోనాల్‌ రమణ్‌ భాయి పటెల్‌ మీద 4.10 లక్షల ఓట్ల భారీ మెజారీతో గెలుపొందారు. అమిత్ షాకు మొత్తంగా 5.26 లక్షల ఓట్లు పోలవగా.. ఆయన ప్రత్యర్థి రమణ్ భాయి పటేల్ కు 1.15 లక్షల ఓట్లు దక్కాయి. ఇక బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీకి చెందిన మహమ్మద్‌ అనీశ్‌ దేశాయ్‌కి డిపాజిట్‌ దక్కలేదు. ఆయనకు 3,244 ఓట్లు మాత్రమే వచ్చాయి.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, కేంద్రంలో మరోసారి ఎన్టీయే ప్రభుత్వ ఏర్పాటు దిశగా కొనసాగుతున్నది. ఇప్పటివరకు 297 చోట్ల ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో కొనసాగుతుండగా, ఇండియా బ్లాక్‌ 225 స్థానాల్లో మెజార్టీలో ఉన్నది. ఇప్పటివరకు ఇరు కూటములు ఒక్కో చోట విజయం సాధించారు. మరో 19 సీట్లలో ఇతరులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Read Also: Northeast Result : ఈశాన్యంలో బీజేపీయేతర పార్టీలదే హవా

  Last Updated: 04 Jun 2024, 01:16 PM IST