Site icon HashtagU Telugu

Detectives – Elections : రంగంలోకి ప్రైవేట్ డిటెక్టివ్‌లు.. ఎన్నికల వేళ పొలిటికల్ వార్!

Detectives Elections

Detectives Elections

Detectives – Elections : లోక్‌సభ ఎన్నికల సమరంలో గెలవడానికి రాజకీయ పార్టీలు తమ సర్వశక్తులను ఒడ్డుతున్నాయి. ప్రత్యర్ధి పార్టీలను ఓడించాలనే వ్యూహంతో చాకచక్యంగా పావులు కదుపుతున్నాయి. ప్రత్యర్ధి పార్టీల వ్యూహాలను ముందే పసిగట్టేందుకు పలుచోట్ల కొన్ని పార్టీలు ఏకంగా ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీల సేవలను కూడా వాడుకుంటున్నాయి. ప్రత్యేకించి పార్టీల నుంచి ఫిరాయించే అవకాశం ఉన్న వారిపై , పార్టీకి సంబంధించిన కీలక సమాచారాన్ని బయటపెట్టేందుకు యత్నించే వారిపై నిఘా పెట్టేందుకు ఈ డిటెక్టివ్‌లను వాడుకుంటున్నారట. దీన్నిబట్టి ఎన్నికల్లో(Detectives – Elections) మంచి ఫలితాన్ని సాధించేందుకు రాజకీయ పార్టీలు ఈ అదనపు ఖర్చును చేసేందుకు కూడా రెడీ అయ్యాయనే విషయం క్లియర్ అయిపోతోంది.

We’re now on WhatsApp. Click to Join

ప్రైవేట్ డిటెక్టివ్‌లకు పలు రాజకీయ పార్టీలు ఇస్తున్న టాస్క్‌ల గురించి తెలిస్తే మనం ఆశ్చర్యపోతాం.  ప్రత్యర్థి పార్టీల నాయకుల అక్రమ సంబంధాలపైనా వీళ్లతో నిఘా పెట్టిస్తున్నారట. రాజకీయ ప్రత్యర్ధులు నిత్యం కలిసే వ్యక్తుల బ్యాక్ గ్రౌండ్‌ను తెలుసుకునే పనిని డిటెక్టివ్‌లకు అప్పగిస్తున్నారట. అంతేకాదు ప్రత్యర్ధుల బలాలు, బలహీనతలను బేరీజు వేసుకునేందుకు కూడా డిటెక్టివ్‌ల సహకారాన్ని పొలిటికల్ పార్టీలు తీసుకుంటున్నాయట. ప్రత్యర్ధుల దినచర్యతో పాటు వారు ఎక్కువగా కలుస్తున్న సామాజిక వర్గాల నేతలపైనా డిటెక్టివ్‌లు డేగకన్ను వేసి ఉంచుతున్నారట.టికెట్ ఆశించి భంగపడిన నేతలను కూడా రాజకీయ పార్టీలు వదలడం లేదట. వాళ్లు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ? ఎవరిని కలవబోతున్నారు ? అనేది ఆరా తీసేందుకు డిటెక్టివ్‌లను మోహరిస్తున్నారట.

Also Read : CM Arvind Kejriwal: సీఎం అరెస్ట్ అయితే రాజీనామా చేయాల్సిందేనా? రాజ్యాంగం ఏమని సూచిస్తుంది?

అంతేకాదు.. రాజకీయ పార్టీలు తాము టికెట్లు కేటాయించిన అభ్యర్థులు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారా ? ఇతరులతో కుమ్మక్కయి అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారా ? అనేది కూడా ఎప్పటికప్పుడు డిటెక్టివ్‌ల ద్వారా తెలుసుకుంటున్నాయట. వీరి నుంచి వచ్చే సమాచారం ఆధారంగా గ్రౌండ్ వర్క్ చేయాల్సిన తీరుపై పార్టీల అధిష్టానాల నుంచి గైడ్ లైన్స్ జారీ అవుతున్నాయట. ఇక ప్రత్యర్ధి పార్టీలు నగదు, మద్యం ఎక్కడ స్టాక్ చేస్తున్నాయి ? వాటి పంపిణీకి ఎలా ప్లాన్ చేస్తున్నాయి ? అనేది కూడా తెలుసుకునేందుకు రాజకీయ పక్షాలు డిటెక్టివ్‌లు వాడుకుంటున్నాయి. ప్రత్యర్ధి పార్టీ అభ్యర్ధితో పోలిస్తే తమ అభ్యర్థి బలాబలాలను కూడా వీరి ద్వారా తెలుసుకుంటున్నారు.

Also Read :Health Department: తెలంగాణ ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీపై కీలక ప్రకటన