Lok Sabha Elections 2024 : ఐదో విడత పోలింగ్​ ప్రారంభం.. కొత్త రికార్డు సృష్టించాలని ఓటర్లకు ప్రధాని పిలుపు

లోక్‌సభ ఎన్నికల ఐదో విడత పోలింగ్‌ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది.

  • Written By:
  • Publish Date - May 20, 2024 / 07:43 AM IST

Lok Sabha Elections 2024 : లోక్‌సభ ఎన్నికల ఐదో విడత పోలింగ్‌ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఈ దశలో 6 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని 49 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్‌ జరుగనుంది. మొత్తం 695మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 8 కోట్ల 95 లక్షల మంది ఓటర్ల కోసం ఈసీ 94,732 పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేసింది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ పోలింగ్‌ జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ట్వీట్ చేస్తూ.. ఐదో దశ లోక్​సభ ఎన్నికల్లో(Lok Sabha Elections 2024) ఓటర్లంతా కొత్త రికార్డును సృష్టించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ప్రజాస్వామ్య పండుగలో ఓటర్లంతా ఉత్సాహంగా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

We’re now on WhatsApp. Click to Join

అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని 14, మహారాష్ట్రలోని 13, పశ్చిమ బెంగాల్‌లోని 7, బిహార్‌లోని 5, జార్ఖండ్‌లోని 3, జమ్మూకశ్మీర్‌లోని 1, లద్దాఖ్‌లోని 1 స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది.  ఈ విడతను కలుపుకొని దేశంలోని మొత్తం 543 లోక్‌సభ నియోజకవర్గాలకుగానూ 428 సీట్లకు పోలింగ్‌ పూర్తవుతుంది. ఈ విడత ఎన్నికల బరిలో నిలిచి ప్రముఖ అభ్యర్థుల్లో రాజ్‌నాథ్‌ సింగ్, పీయూష్‌ గోయల్, స్మృతి ఇరానీ, రాహుల్‌గాంధీ, ఒమర్‌ అబ్దుల్లా ఉన్నారు.

Also Read :Lok Sabha Elections 2024: రసవత్తరంగా ఐదో దశ పోలింగ్.. బరిలో ఉన్న సీనియర్లు

  • జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా స్థానంలో  500 మందికిపైగా శతాధిక వయస్కులు ఉండటం విశేషం. ఇక్కడ మొత్తం 22 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వారిలో 14 మంది స్వతంత్రులే. ఇక్కడ మాజీ సీఎం, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లాకు మాజీ మంత్రి సజ్జాద్‌ లోన్‌ నుంచి గట్టి సవాలు ఎదురవుతోంది.
  • బెంగాల్‌లో ఈ విడతలోని 57 శాతం పోలింగ్‌ కేంద్రాలను సున్నితమైనవిగా గుర్తించడం వల్ల ముందుజాగ్రత్త చర్యగా 60 వేలకుపైగా కేంద్ర బలగాలతోపాటు 29,172 మంది రాష్ట్ర పోలీసులను మోహరించారు.
  • ప్రస్తుతం రాహుల్‌ రాయ్‌బరేలీలో రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు.
  • అమేథీలో స్మృతి ఇరానీపై గాంధీ కుటుంబ సన్నిహితుడు కిశోరీలాల్‌ శర్మను కాంగ్రెస్‌ బరిలోకి దించింది.
  • లక్నోలో మూడోసారి గెలిచి  హ్యాట్రిక్‌ సాధించాలని రాజ్‌నాథ్‌ సింగ్‌ టార్గెట్‌గా పెట్టుకున్నారు.

Also Read :Prediabetes: ప్రీ-డయాబెటిస్ మరియు డయాబెటిస్ మధ్య వ్యత్యాసం.. ప్రీ-డయాబెటిస్ లక్షణాలు