BSP – INDIA : అఖిలేష్‌కు షాక్.. ‘ఇండియా’లోకి బీఎస్పీ.. కాంగ్రెస్ బడా స్కెచ్

BSP - INDIA : ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలక సమీకరణం చోటుచేసుకునే దిశగా అడుగులు పడుతున్నాయి.

  • Written By:
  • Publish Date - February 18, 2024 / 03:49 PM IST

BSP – INDIA :  దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో  విపక్ష కూటమి ‘ఇండియా’లో సమీకరణాలు మారే దిశగా అడుగులు పడుతున్నాయి. త్వరలోనే ఇండియా కూటమిలోకి బీఎస్పీ ఎంటరయ్యే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. ఈవిషయాన్ని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ అవినాశ్ పాండే మీడియాకు చెప్పారు. బీఎస్పీ కోసం ఇండియా కూటమి తలుపులు తెరిచే ఉంటాయని ఆయన పేర్కొన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా జరిగే ఐక్య పోరాటంలో బీఎస్పీ కలిసిరావాలని, ఆ పార్టీ చీఫ్ మాయవతి దీనిపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అవినాశ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

We’re now on WhatsApp. Click to Join

సమాజ్‌వాదీకి మా మద్దతు..

ఇండియా కూటమిలోకి బీఎస్పీ చేరాలని కోరుకుంటున్నట్టు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ అవినాశ్ పాండే చెప్పారు. రాష్ట్రంలో సమాజ్ వాదీ పార్టీకి కాంగ్రెస్ పూర్తి మద్దతు ఇస్తున్నట్టు వెల్లడించారు. సీట్ల సర్దుబాటు విషయంలో త్వరలోనే క్లారిటీ వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అఖిలేష్ యాదవ్‌తో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుపుతున్నామని తెలిపారు. ఈ నెలాఖరులోగా దీనిపై క్లారిటీ వస్తుందని ఆయన వెల్లడించారు. సమాజ్‌వాదీ పార్టీతో సానుకూల వాతావరణంలోనే చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇండియా కూటమి నుంచి ఆర్ఎల్డీ వైదొలగడం దురదృష్టకరమన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఇటీవల ప్రకటించారు. ఈనేపథ్యంలో ఇప్పటివరకు సోనియా ప్రాతినిధ్యం వహించిన రాయ్ బరేలీ నుంచి ఈసారి ప్రియాంకాగాంధీ పోటీ చేయాలని అవినాష్ పాండే కోరారు.

మాయావతి రాక.. అఖిలేష్‌‌కు చెక్ ?

ఇండియా కూటమి ఏర్పడినప్పుడు ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్, ఎస్పీ, రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ) భాగస్వామ్య పార్టీలుగా ఉన్నాయి. అయితే ఇటీవల ఎన్డీఏ కూటమిలో ఆర్ఎల్డీ పార్టీ చేరిపోయింది. ఈ నేపథ్యంలోనే బీఎస్పీని ఇండియా కూటమిలోకి కాంగ్రెస్ ఆహ్వానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ కాంగ్రెస్‌ను ఎద్దేవా చేస్తూ గత కొన్ని నెలల్లో  చాలాసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ బలాన్ని తగ్గించి చూపిస్తూ అఖిలేష్ ఎద్దేవా చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల టైంలోనూ సీట్ల సర్దుబాటు విషయంలో అఖిలేష్ పెద్ద రాద్దాంతమే చేశారు. మధ్యప్రదేశ్‌లో తమ పార్టీకి సీట్లను కాంగ్రెస్ కేటాయించలేదని మీడియా సాక్షిగా కఠినమైన కామెంట్స్ చేశారు. భవిష్యత్తులో సమాజ్ వాదీ పార్టీ ఒంటరిగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయనే సమాచారం అందడంతో కాంగ్రెస్ అలర్ట్ అయింది. ముందుజాగ్రత్త చర్యగా బీఎస్పీ చీఫ్ మాయావతితో టచ్‌లోకి వెళ్లింది. ఒకవేళ సమాజ్ వాదీ పార్టీ ఇండియా కూటమి నుంచి వైదొలిగితే మెజారిటీ సీట్లను బీఎస్పీకి కేటాయించి యూపీ ఎన్నికల్లో పోటీ చేయాలని కాంగ్రెస్(BSP – INDIA) డిసైడైంది.

Also Read : PhD At 89 Years : 89 ఏళ్ల ఏజ్‌లో పీహెచ్‌డీ.. పెద్దాయన కొత్త రికార్డు