Site icon HashtagU Telugu

Elections Notification : మార్చి 15లోగా లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ ?

Election Commission

Election Commission

Elections Notification : కేంద్ర ఎన్నికల సంఘం టీమ్ గత రెండు నెలలుగా దేశవ్యాప్తంగా పర్యటిస్తోంది. వచ్చే గురువారం లేదా శుక్రవారంలోగా అది ఢిల్లీకి చేరుకుంటుంది. రాష్ట్రాలవారీగా  లోక్‌సభ ఎన్నికల సంసిద్ధతపై  తాము రెడీ చేసుకున్న రిపోర్టులను ఈసీ టీమ్ రివ్యూ చేస్తుంది. ఆ తర్వాత  లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ తయారీపై ఫోకస్ పెడతారు. ఎన్నికల తేదీల ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తారు. ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి అధికారికంగా లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌ను(Elections Notification) రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. వచ్చే గురువారం నుంచి శనివారం మధ్య ఎప్పుడైనా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join

ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగానే దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. దాంతో ఇక కొత్త ప్రభుత్వ పథకాల అమలుకు అవకాశం ఉండదు. ఉన్న పథకాల్లో కొన్నింటి అమలును కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆపేసే అవకాశం ఉంటుంది. అందుకే దేశంలోని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ సంక్షేమ పథకాలను వీలైనంత వేగంగా అమల్లోకి తేవడంపై ఫోకస్ పెట్టాయి. ఎందుకంటే వాళ్ల టార్గెట్.. వచ్చే ఎన్నికల్లో గెలవడం మాత్రమే. ఆ పార్టీ.. ఈ పార్టీ అనే తేడా లేకుండా సరిగ్గా ఎన్నికలకు ముందు ప్రజలను ప్రలోభపెట్టడంలో దేశవ్యాప్తంగా అధికార పక్షాలు బిజీగా ఉన్నాయి. తెలంగాణ, ఏపీలలోనూ ప్రభుత్వ పథకాల అమలులో, ఉద్యోగ ప్రకటనలను విడుదల చేయడంలో ఎంత హడావుడి జరుగుతోందో మనమంతా చూస్తున్నాం.

Also Read : Arun Goel : ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రిజైన్.. ఎందుకు ?

ఈ ఏడాది సెప్టెంబర్ లోగా జమ్మూకాశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో లోక్‌సభ ఎన్నికలతోపాటే.. అక్కడ కూడా ఎన్నికలు జరిపేలా కేంద్ర ఎన్నికల సంఘం ప్లాన్ చేస్తోంది. వాస్తవానికి అక్కడ శాంతిభద్రతల పరిస్థితి కంట్రోల్‌లో లేదు. ఇటీవల జరిగిన ఉగ్రదాడి ఘటనలే అందుకు నిదర్శనం. ఈ ఉగ్రదాడుల్లో ఎంతోమంది భారత జవాన్లు, కశ్మీరీ పోలీసులు అమరులయ్యారు.  కేంద్ర ఎన్నికల సంఘం టీమ్  రేపటి (సోమవారం) నుంచి బుధవాం వరకు జమ్మూకాశ్మీర్‌లోనే పర్యటించనుంది. అక్కడ పర్యటన ముగియగానే ఢిల్లీకి ఈసీ టీమ్ వచ్చేసి.. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌పై కసరత్తు మొదలుపెడుతుంది.