BJP Candidates : బీజేపీ పేరెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్). ప్రధాని మోడీ, ఎల్‌కే అద్వానీ, వాజ్‌పేయి, అమిత్‌షా వంటి దిగ్గజ నేతలంతా గతంలో ఆర్ఎస్ఎస్‌లో పనిచేశారు. అయితే గత పదేళ్ల వ్యవధిలో ఆర్ఎస్ఎస్ నేపథ్యం లేని చాలామంది ఇతర పార్టీల నేతలు బీజేపీలో చేరారు. వాళ్లకు లోక్‌సభ టికెట్లను కూడా కాషాయ పార్టీ కేటాయించింది. కొంతమందిని రాజ్యసభకు పంపింది. మరికొందరికి బీజేపీలో పార్టీపరమైన కీలక పదవులను కట్టబెట్టారు. తాజాగా లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ(BJP Candidates) టికెట్ పొందిన వారిలో భారీసంఖ్యలో ఫిరాయింపుదారులు ఉన్నారు. ఆ వివరాలు చూద్దాం..
We’re now on WhatsApp. Click to Join
ఈ లోక్‌సభ పోల్స్‌లో దేశవ్యాప్తంగా పోటీచేస్తున్న 435 మంది బీజేపీ అభ్యర్థుల్లో 106 మంది ఇతర పార్టీల ఫిరాయింపుదారులే. వారిలోనూ 90 మంది గత ఐదేళ్లలో బీజేపీలోకి ఫిరాయించిన వారే కావడం గమనార్హం. ఈసారి ఎలాగైనా 400 లోక్‌సభ సీట్లు గెలవాలని టార్గెట్‌గా పెట్టుకున్న బీజేపీ.. వ్యూహాత్మకంగానే ఇతర పార్టీల కీలక నేతలను బీజేపీలో చేర్చుకుంది. దీనివల్ల ఆయా నేతలు గత కొన్ని ఏళ్లుగా వారివారి లోక్‌సభ స్థానాల పరిధిలో రెడీ చేసుకున్న క్యాడర్ బీజేపీకి అందుబాటులోకి వచ్చింది. బీజేపీకి సొంత క్యాడర్ పెద్దగా లేని చోట ఇలాంటి కీలక నేతల ఫిరాయింపులు బాగా కలిసొస్తాయని కాషాయ పార్టీ పెద్దలు భావిస్తున్నారు.
Also Read :Southwest Monsoon : తెలుగు రాష్ట్రాల్లోకి ‘నైరుతి’ ప్రవేశంపై క్లారిటీ
- ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ 6 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయగా వారిలో ఏకంగా ఐదుగురు 2019 తర్వాతే పార్టీ తీర్థం పుచ్చుకున్న వారు కావడం గమనార్హం.
- తెలంగాణలోనూ 17 మంది బీజేపీ అభ్యర్థుల్లో 11 మంది 2014 తర్వాత పార్టీలో చేరిన వారే. వీరిలో చాలామంది మాజీ కాంగ్రెస్, టీడీపీ, బీఆర్‌ఎస్ నేతలే.
- బీజేపీ చాలా బలంగా ఉన్న యూపీ, హర్యానా వంటి రాష్ట్రాల్లో కూడా ఇదే విధమైన ట్రెండ్ కొనసాగడం గమనార్హం.
- హర్యానాలోని 10 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ తరఫున బరిలో ఉన్నవారిలో ఆరుగురు 2014 తర్వాత ఆ పార్టీలో చేరినవారే.
- యూపీలో బీజేపీ పోటీ చేస్తున్న 74 లోక్‌సభ స్థానాలకుగానూ 23 చోట్ల ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లే పోటీ చేస్తున్నారు.
- పంజాబ్‌లోని 13 స్థానాల్లో ఏకంగా ఏడుగురు బీజేపీ అభ్యర్థులు ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారే.
- జార్ఖండ్‌లో 13 మంది బీజేపీ అభ్యర్థుల్లో ఏడుగురు జేఎంఎం, కాంగ్రెస్, జార్ఖండ్ వికాస్ మోర్చాల నుంచి వచ్చి చేరిన వారే.
- ఒడిశాలో 29 శాతం, తమిళనాడులో 26 శాతం మంది బీజేపీ అభ్యర్థులు కూడా ఇతర పార్టీల ఫిరాయింపుదారులే.
- మహారాష్ట్రలోనూ పావు వంతు బీజేపీ అభ్యర్థులు కూడా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే.
- బీజేపీలోకి చేరిన ప్రముఖ జంపర్లలో జ్యోతిరాదిత్య సింధియా, జితిన్ ప్రసాద, నవీన్ జిందాల్, అశోక్ తన్వర్, ప్రణీత్ కౌర్, సీతా సోరెన్ ఉన్నారు.