Lockdown : క‌రోనా మూడో వేవ్ పై మోడీ సమీక్ష‌..మ‌ళ్లీ భార‌త్ లాక్ డౌన్‌?

మ‌ళ్లీ లాక్ డౌన్ దిశ‌గా భార‌త దేశ కోవిడ్ రిపోర్ట్ వెళుతోంది. కొత్త వేరియెంట్ ల‌క్ష‌ణాలతో కూడిన కేసులు రెండు రోజుల్లోనే అనూహ్యంగా పెరిగాయి.

  • Written By:
  • Updated On - November 27, 2021 / 12:54 PM IST

మ‌ళ్లీ లాక్ డౌన్ దిశ‌గా భార‌త దేశ కోవిడ్ రిపోర్ట్ వెళుతోంది. కొత్త వేరియెంట్ ల‌క్ష‌ణాలతో కూడిన కేసులు రెండు రోజుల్లోనే అనూహ్యంగా పెరిగాయి. కేర‌ళ‌, ప‌శ్చిమ బెంగాల్‌, క‌ర్నాట‌క‌, మిజోరాం రాష్ట్రాల్లో పెరిగిన కేసుల‌పై ఆందోళ‌న వ్య‌క్తం అవుతోంది. సెకండ్ వేవ్ క‌రోనా కూడా కేర‌ళ నుంచే తొలి ప్రారంభం అయింది. ఈసారి మూడో వేవ్ కు సంబంధించిన కొత్త వేరియెంట్ కేర‌ళ రాష్ట్రంలోనే క‌నిపించింది. దీంతో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఉన్న‌తాధికారుల‌తో అత్య‌వ‌స‌ర స‌మ ఆవేశాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేశాడు.
సమావేశానికి క్యాబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా, ప్రధాన మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ పికె మిశ్రా, కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ మరియు నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వికె పాల్ సహా ఉన్నతాధికారులు హాజరయ్యారు. దేశ వ్యాప్తంగా వాక్సినేష‌న్, కోవిడ్ కేసుల న‌మోదు మీద సమావేశంలో స‌మీక్షించారు. గత 24 గంటల్లో 8,318 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఉదయం నమోదైన దానితో పోలిస్తే ఇది 21.1 శాతం తక్కువ. భారతదేశం మొత్తం మీద ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదు అయిన కేసుల సంఖ్య 3,45,63,749కి చేరుకుంది.
శనివారం తాజాగా నమోదైన ఐదు రాష్ట్రాల్లో కేరళ 4,677 కేసులు, తమిళనాడుల746 కేసులు, పశ్చిమ బెంగాల్ 710 కేసులు, కర్ణాటక 402 కేసులు, మిజోరం 359 కేసులు వ‌చ్చిన‌ట్టు గుర్తించారు. గత 24 గంటల్లో, భారతదేశంలో కొత్త వేరియెంట్ తో కూడిన కోవిడ్ కేసులతో 465 మంది మ‌ర‌ణించారు. దేశంలో కోవిడ్ సంఖ్య ప్ర‌స్తుతం 4,67,933 కు చేరుకుంది. ప్రస్తుతం భారతదేశంలో 1,07,019 మందికి కోవిడ్-19 కేసులు సీరియ‌స్ గా ఉన్నాయ‌ని రిపోర్ట్ లో పొందుప‌రిచారు. భారతదేశం గత 24 గంటల్లో 73,58,017 కోవిడ్ వ్యాక్సిన్ డోస్‌లను అందించింది. భారతదేశంలో ఇప్పటివరకు ఇచ్చిన వ్యాక్సిన్ మోతాదుల సంఖ్య 1,21,06,58,262.
కొత్త వేరియెంట్ రావ‌డంతో దేశ వ్యాప్తంగా ఆందోళ‌న చెందుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) SARS-CoV-2 వేరియంట్ B.1.1.529ని స‌ వేరియంట్ ను చాలా సీరియ‌స్ వైర‌స్ గా పేర్కొంది. ద‌క్షిణాఫ్రికా, హాంకాంగ్, ఇజ్రాయెల్, బ‌ట్స్వానాల‌ర నుంచి వ‌స్తోన్న ఈ కొత్త కరోనావైరస్ వేరియంట్‌కు ఓమిక్రాన్ అని పేరు పెట్టారు. ఈ వేరియంట్ వ్యాప్తిని అరికట్టే ప్రయత్నంలో భాగంగా అనేక దేశాలు ప్రయాణ నిషేధాన్ని విధించాయి. ముఖ్యంగా దక్షిణ ఆఫ్రికాలోని దేశాల నుండి వచ్చే వారి కోసం ప్ర‌త్యేకంగా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.
ఏడాదిన్న‌ర త‌రువాత అంతర్జాతీయ ప్రయాణీకుల విమానాలు డిసెంబర్ 15 నుండి తిరిగి ప్రారంభమవుతాయని భారతదేశం శుక్రవారం ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం, డిసెంబర్ 15 నుండి భారతదేశం మరియు దక్షిణాఫ్రికా, హాంకాంగ్ , బోట్స్వానాల మధ్య ప్రీ-కోవిడ్ షెడ్యూల్డ్ ప్రకారం పాసింజ‌ర్ విమానాలలో 50 శాతం నడపడానికి విమానయాన సంస్థలను అనుమ‌తిని పొందాయి.
దక్షిణాఫ్రికా, హాంకాంగ్ మరియు బోట్స్వానా నుండి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులందరినీ కఠినమైన స్క్రీనింగ్ టెస్టింగ్ లు నిర్వహించాలని ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది.
కొత్త వేరియెంట్ గురించి డ‌బ్ల్యూహెచ్ వో చెబుతున్న దాని ప్ర‌కారం ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. రెండో వేవ్ క‌రోనా సంద‌ర్భంగా ప్రాణ న‌ష్టం అపారంగా జ‌రిగింది. ఈసారి అలాంటి పొర‌బాటు చేయ‌కుండా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ముంద‌స్తు జాగ్ర‌త్త‌ల‌కు ఆదేశాల‌ను జారీ చేశాడు. ఉన్న‌తాధికారుల కీల‌క స‌మావేశంలో కోవిడ్ మూడో వేవ్ నియంత్ర‌ణ‌కు క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకునే అధికారాలు రాష్ట్రాల‌కు పూర్తి స్థాయిలో ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నాడ‌ని తెలుస్తోంది.