Lockdown in China : చైనా ఎఫెక్ట్‌, మ‌ళ్లీ క‌రోనా ఆంక్ష‌లు, లాక్ డౌన్ ?

క‌రోనా ఫోర్త్ వేవ్ త‌ర‌ముకొస్తోంది. మ‌ళ్లీ ఆంక్షల దిశ‌గా తెలంగాణ ప్ర‌భుత్వం ఆలోచిస్తోంది. దేశ వ్యాప్తంగా ఒకేసారి 90శాతం పాజిటివ్ కేసుల వ్యాప్తి క‌నిపిస్తోంది. దీంతో హ‌డ‌లి పోతోన్న రాష్ట్రాలు ఆంక్ష‌ల దిశ‌గా స‌మీక్ష చేస్తోంది.

  • Written By:
  • Publish Date - April 18, 2022 / 01:09 PM IST

క‌రోనా ఫోర్త్ వేవ్ త‌ర‌ముకొస్తోంది. మ‌ళ్లీ ఆంక్షల దిశ‌గా తెలంగాణ ప్ర‌భుత్వం ఆలోచిస్తోంది. దేశ వ్యాప్తంగా ఒకేసారి 90శాతం పాజిటివ్ కేసుల వ్యాప్తి క‌నిపిస్తోంది. దీంతో హ‌డ‌లి పోతోన్న రాష్ట్రాలు ఆంక్ష‌ల దిశ‌గా స‌మీక్ష చేస్తోంది. తెలంగాణ వైద్య ఆరోగ్య‌శాఖ అత్య‌వ‌స‌ర స‌మావేశం అయింది. మ‌ళ్లీ కోవిడ్ ఆంక్ష‌లు విధించాల‌ని భావిస్తోంది. ఒమిక్రాన్ కొత్త వేరియంట్లు చాప‌కింద నీరులా వ్యాప్తి చెందుతున్నాయి. ఒక్క రోజులోనే కేసులు దాదాపు రెట్టింపయ్యాయి. మరోవైపు ఫోర్త్ వేర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమయింది. మాస్క్ నిబంధనను మళ్లీ అమలు చేయాలని తెలంగాణ వైద్యశాఖ భావిస్తున్నట్టు సమాచారం. కోవిడ్ నిబంధనలను ప్రస్తుతం తెలంగాణ ప్ర‌భుత్వం పూర్తిగా ఎత్తివేసింది. తాజాగా దేశంలో కేసులు మళ్లీ పెరుగుతుండటంతో మళ్లీ ఆంక్షల దిశగా అడుగులు వేసే అవకాశం ఉండొచ్చని సమాచారం. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,183 కొత్త కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు రోజు నమోదైన కేసుల సంఖ్య 1,150 మాత్రమే. అంటే కేసుల సంఖ్య ఒక్క రోజులోనే దాదాపు 90 శాతం మేర పెరిగింది.

ఇదే సమయంలో కరోనా మృతుల సంఖ్య కూడా అనూహ్యంగా పెరిగింది. గత 24 గంటల్లో 214 మరణాలు నమోదయ్యాయి. అయితే వీటిలో 62 బ్యాక్ లాగ్ మరణాలు ఉన్నప్పటికీ అంతకు ముందు రోజులో పోలిస్తే మరణాల సంఖ్య భారీగానే పెరిగింది. ఇక రోజు వారీ పాజిటివిటీ రేటు 0.31 శాతం నుంచి 0.83 శాతానికి పెరిగింది. ఇప్పటి వరకు దేశంలో నమోదైన కేసుల సంఖ్య 4,30,44,280కి చేరుకోగా, మరణాల సంఖ్య 5,21,965కి చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 11,542 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా వేగంగా కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే 2,66,459 డోసుల వ్యాక్సిన్ వేశారు. ఇప్పటి వరకు 1,86,54,94,355 డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేశారు. అయిన‌ప్ప‌టికీ క‌రోనా కేసులు పెర‌గ‌డంతో కేంద్రం కూడా సీరియ‌స్ గా ఆలోచిస్తోంది. ఒక వైపు చైనా దేశం ప‌రిస్థితి ఫోర్త్ వేవ్ తో దారుణంగా మారింది. బెడ్ రూంలో కూడా భార్య‌భ‌ర్తలు ఆలింగ‌నాలు చేసుకోవ‌ద్ద‌ని ఆ దేశం ఆంక్ష‌లు పెట్టే ప‌రిస్థితికి వెళ్లింది. ఆ ఆనుభ‌వాల దృష్ట్యా కేంద్రం మ‌రోసారి ఆంక్ష‌లు, లాక్ డౌన్ దిశ‌గా యోచిస్తోంద‌ని తెలుస్తోంది.