Site icon HashtagU Telugu

Agra Highway : కోళ్ల వ్యాన్‌కు ప్రమాదం..క్షణాల్లో కోళ్లను మాయం చేసిన వాహనదారులు

Locals Carrying Chickens Af

Locals Carrying Chickens Af

మన దేశంలోనే కాదు ప్రపంచం లో ఎక్కడైన ఫ్రీ (Free) వస్తుందంటే..ఏది వదిలిపెట్టారు..ఆఖరికి ఫినాయిల్ అయినా సరే..అలాంటిది ఫ్రీ గా రోడ్ ఫై కోళ్లు దొరుకుతున్నాయంటే ఆగుతారా..చేతికి అందిన వాటిని ఎత్తుకుని వెళ్లారు..ఈ ఘటన ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌ (Agra Highway)వేపై జరిగింది. గత కొద్దీ రోజులుగా చలి వణికిస్తోంది. ముఖ్యంగా పొగమంచు ఉదయం 8 దాటినా కానీ వీడడం లేదు. ఈ పొగమంచు కారణంగా అనేక వాహనాలు ప్రమాదానికి గురవుతున్నాయి. తాజాగా దట్టమైన పొగమంచు కారణంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై బుధవారం ఉదయం ప‌లు వాహ‌నాలు ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయి. అయితే ఆ వాహ‌నాల్లో కోళ్ల (Chiken) లోడ్‌తో వెళ్తున్న ఓ ట్ర‌క్కు కూడా ఉంది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ ప్రమాదాన్ని గమనించిన వాహనదారులు ఎవరైనా ప్రమాదం జరిగిందా అని అరా తీయడం మానేసి..ట్ర‌క్కు లో ఉన్న కోళ్లను ఎలా తీసుకెళ్లాలని ఆలోచించడం మొదలుపెట్టారు. అంతే ఇక ట్ర‌క్కులో ఉన్న కోళ్ల‌ను తాళాలు పగలగొట్టి మరీ ఎత్తుకెళ్లడం మొదలుపెట్టారు. ఇక కొందరు అయితే ఒకేసారి నాలుగైదు కోళ్లను చేతిలో పట్టుకుని పారిపోయారు. మరికొందరు ఏకంగా సంచుల్లో వేసుకుని అక్కడి నుంచి జారుకున్నారు. అక్కడే ఉన్న ఆ ట్రక్కు డ్రైవర్.. తన వాహనం నుంచి కోళ్లను ఎత్తుకెళ్ళొదంటూ మొత్తుకున్నా ఎవరూ వినలేదు..చేతికి అందినకాడికి దోచేశారు..క్షణాల్లో కోళ్లన్నీ మాయం అయ్యాయి. ఎత్తుకెళ్లిన కోళ్ల విలువ 1.5 లక్షలు ఉంటుందని వాహన డ్రైవర్ వాపోయాడు. దీనికి సంబదించిన వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.

Read Also : Bharat Rice : కిలో రూ.25కే ‘భారత్ రైస్’.. పేదల కోసం మోడీ సర్కారు ప్లాన్