Biggest Train Accidents : ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 233కు చేరగా, 900 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సోరో, గోపాల్‌పూర్, ఖంటపాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఇటీవలి దేశంలో చోటుచేసుకున్న అతిపెద్ద రైలుప్రమాదం ఇదేనని అంటున్నారు. ఈనేపథ్యంలో గత పదేళ్లలో దేశంలో చోటుచేసుకున్నపలు రైలు ప్రమాదాల(Biggest Train Accidents) వివరాలు చూద్దాం..
గత పదేళ్లలో దేశంలో జరిగిన ప్రధాన రైలు ప్రమాదాలివీ
2012 మే 22 : కార్గో రైలు, హుబ్లీ-బెంగళూరు హంపి ఎక్స్‌ప్రెస్ ఆంధ్రప్రదేశ్‌కి సమీపంలో ఢీకొన్నాయి. రైలు నాలుగు బోగీలు పట్టాలు తప్పడం, వాటిలో ఒక దానిలో మంటలు చెలరేగడంతో దాదాపు 25 మంది మరణించారు. 43 మంది గాయపడ్డారు.
2014 మే 26 : ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్ ప్రాంతంలో గోరఖ్‌పూర్ వైపు వెళుతున్న గోరఖ్‌ధామ్ ఎక్స్‌ప్రెస్ ఖలీలాబాద్ స్టేషన్‌కు సమీపంలో ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఫలితంగా 25 మంది మరణించారు. 50 మందికి పైగా గాయపడ్డారు.
2016 నవంబర్ 20 : ఇండోర్-పాట్నా ఎక్స్‌ప్రెస్ కాన్పూర్‌లో పుఖ్రాయాన్‌కు సమీపంలో పట్టాలు తప్పాయి. దీంతో కనీసం 150 మంది ప్రయాణికులు మరణించారు. 150 మందికి పైగా గాయపడ్డారు.
Also read : Coromandel Express: కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం.. 233కి చేరిన మృతుల సంఖ్య
2017 ఆగస్టు 23 : ఉత్తరప్రదేశ్‌లోని ఔరైయా సమీపంలో ఢిల్లీకి వెళ్లే కైఫియత్ ఎక్స్‌ప్రెస్ తొమ్మిది రైలు కోచ్‌లు పట్టాలు తప్పింది. దీంతో కనీసం 70 మంది గాయపడ్డారు.
2017 ఆగస్ట్ 18 : పూరీ-హరిద్వార్ ఉత్కల్ ఎక్స్‌ప్రెస్ ముజఫర్‌నగర్‌లో పట్టాలు తప్పింది. దీంతో 23 మంది మరణించారు. దాదాపు 60 మంది గాయపడ్డారు.
2022 జనవరి 13 : పశ్చిమ బెంగాల్ ప్రాంతంలోని అలీపుర్ దువార్‌లో బికనీర్-గౌహతి ఎక్స్‌ప్రెస్ లోని 12 కోచ్‌లు పట్టాలు తప్పాయి. దీంతో 9 మంది మరణించారు. 36 మంది గాయపడ్డారు.
2023 జూన్ 2 : బెంగళూరు నుంచి హౌరా వెళ్తున్న యశ్వంతపూర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ బాలేశ్వర్ సమీపంలోని బహానగా బజార్ వద్ద శుక్రవారం రాత్రి దాదాపు 7 గంటల సమయంలో తొలుత పట్టాలు తప్పింది. దీంతో పలు బోగీలు పక్కనే ఉన్న పట్టాలపై పడ్డాయి. ఈ సమయంలో వచ్చిన షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమండల్ ఎక్స్‌ప్రెస్ వాటిని ఢీకొట్టింది. దాంతో కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 15 బోగీలు బోల్తాపడ్డాయి. అనంతరం కోరమండల్ కోచ్‌లను పక్కనున్న ట్రాక్‌పై వస్తోన్న గూడ్సు రైలు ఢీకొంది. మూడు రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకోవడంతో ప్రమాదం తీవ్రత భారీగా పెరిగింది. ఇటీవలి దేశంలో చోటుచేసుకున్న అతిపెద్ద రైలుప్రమాదం ఇదేనని భావిస్తున్నారు.