Site icon HashtagU Telugu

Manish Sisodia: లిక్కర్ స్కాం అంతా ఫేక్…సీబీఐపై మనీష్ సిసోడియా సంచలన ఆరోపణలు..!!

Manish Imresizer

Manish Imresizer

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సీబీఐపై సంచలన ఆరోపణలు చేశారు. లిక్కర్ స్కాం అంతా ఫేక్ అంటూ కొట్టిపారేశారు. ఈ కేసు పూర్తిగా నకిలీది అంటూ అభవర్ణించారు. ఈ కేసుకు సంబంధించి సోమవారం సిసోడియాను సీబీఐ 9గంటలపాటు సుదీర్ఘంగా విచారించింది. అనంతరం సాయంత్రం మీడియాతో మాట్లాడారు సిసోడియా.

ఇది ఎక్సైజ్ పాలసీ లేదా అవినీతికి సంబంధించిన కేసు కాదన్నప్పుడే తనకు అసలు విషయం అర్థమైందని చెప్పారు. ఈ కేసు కేవలం ఢిల్లీలో ఆపరేషన్ లోటస్ ను సక్సెస్ చేసేందుకే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆరోపించారు. బీజేపీ నేతలు తమపై ఒత్తిడి తెస్తున్నట్లు సిసోడియా ఆరోపించారు. పార్టీ మారితే సీఎం పదవి ఇస్తామంటూ ఆఫర్ ఇచ్చారని చెప్పుకొచ్చారు.

కాగా సీబీఐ ఎలాంటి స్కాం గురించి విచారించడం లేదు. అక్కడ ఆపరేషన్ లోటస్ ను సక్సెస్ చేసేందుకు తనపై కేసు పెట్టినట్లు నాకు అర్థమైంది. పదివేలకోట్ల కుంభకోణం జరిగిందని బీజేపీ అంటోంది. కానీ ఎలాంటి కుంభకోణం జరగలేదు. ఇదంతా ఫేక్ ..కల్పితం మాత్రమేనని అర్థమైందని సిసోడియా చెప్పుకొచ్చారు. కాగా సిసోడియా ఆరోపణలను సీబీఐ కొట్టిపారేసింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఎఫ్ఐఆర్ లో తనపై వచ్చిన ఆరోపణ ప్రకారమే విచారణ కొసాగిందని స్పష్టం చేసింది.