Kejriwal : లిక్కర్‌ పాలసీ సీబీఐ కేసు..కేజ్రీవాల్‌ కస్టడీ పొడిగింపు

లిక్కర్‌ పాలసీ సీబీఐ కేసులో ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌ కస్టడీని రౌస్‌ అవెన్యూ కోర్టు పొడిగింది. దీంతో కేజ్రీవాల్‌ మరికొన్ని రోజులు జైలులోనే ఉండనున్నారు.

  • Written By:
  • Updated On - July 12, 2024 / 03:21 PM IST

Kejriwal: ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసు(Liquor scam case)లో కేజ్రీవాల్‌ మరోసారి నిరాశే ఎదురైంది. లిక్కర్‌ పాలసీ సీబీఐ కేసులో ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌ కస్టడీని రౌస్‌ అవెన్యూ కోర్టు పొడిగింది. దీంతో కేజ్రీవాల్‌ మరికొన్ని రోజులు జైలులోనే ఉండనున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, లిక్కర్‌ పాలసీ కేసులో కేజ్రీవాల్‌ కస్టడీ పొడిగింపుపై నేడు రౌస్‌ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా వాదనల అనంతరం కేజ్రీవాల్‌ కస్టడీని జూలై 25వ తేదీ వరకు జ్యుడిషియల్‌ కస్టడీని కోర్డు పొడిగించింది. దీంతో, ఆయన మరికొన్ని రోజులు జైలులోనే ఉండనున్నారు.

Read Also: YS Jagan: మాజీ సీఎం జగన్‌పై హత్యాయత్నం కేసు నమోదు

మరోవైపు కేజ్రీవాల్‌కు మద్యం పాలసీ కేసులో సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. లిక్కర్‌ స్కామ్‌ కేసులో తనను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరెస్ట్‌ చేయడాన్ని సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ధర్మాసనం.. సీఎంకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు పూర్తిస్థాయి విచారణ కోసం ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తూ తీర్పు ఇచ్చింది.

Read Also: Laugh : జపాన్ లో కొత్త చట్టం..నవ్వకుండా ఉండలేరు

Follow us