Arvind Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు తీహార్ జైలులో ముప్పు ఉందంటూ జైలు అధికారులకు సమాచారం అందింది. దీంతో వారు వెంటనే అలర్ట్ అయ్యారు. అదే జైలులో ఉన్న కొన్ని గ్యాంగుల సభ్యులు పాపులర్ అయ్యేందుకు కేజ్రీవాల్‌పై ఎటాక్ చేసే ఛాన్స్ ఉందని జైలు అధికారులకు సమాచారం అందిందట. ఇప్పటికే ఖలిస్థాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ నుంచి కేజ్రీవాల్‌కు బెదిరింపులు వచ్చాయి. తీహార్ జైలులోని ఖలిస్థానీ ఉగ్రవాదులు అరవింద్ కేజ్రీవాల్‌పై దాడి చేసే రిస్క్ ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
We’re now on WhatsApp. Click to Join
తీహార్ జైలులోని నంబర్-2 కారాగారంలో సీఎం కేజ్రీవాల్(Arvind Kejriwal) జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. గతంలో నంబర్ కారాగారంలో హత్యలు జరిగిన దాఖలు కూడా ఉన్నాయి. 2021లో జైలులోని ఖైదీల మధ్య జరిగిన గ్యాంగ్ వార్‌లో శ్రీకాంత్ రామస్వామి అనే నిందితుడిని మర్డర్ చేశారు. ఢిల్లీలోని వసంత్ విహార్ వద్ద 2015లో జరిగిన ఓ హత్య కేసులో శ్రీకాంత్ రామస్వామిని అరెస్టు చేశారు. అయితే జైలుకు వచ్చాక కొందరు తోటి ఖైదీలు బ్యాట్లతో తీవ్రంగా కొట్టి.. శ్రీకాంత్ రామస్వామిని హతమార్చారు. ఈమేరకు అప్పట్లో తీహార్ జైలు అధికారులు కోర్టుకు నివేదించారు. ఈ కేసుకు సంబంధించి నలుగురిని అరెస్టు చేశారు. ఆర్థిక నేరగాడు సుకేష్ చంద్రశేఖర్ తీహార్ జైలులో భోగభాగ్యాలు అనుభవించిన విషయం కొన్ని నెలల క్రితం కలకలం రేపింది.అతగాడు పెద్దఎత్తున సెల్ ఫోన్లు కూడా వాడాడని దర్యాప్తులో వెల్లడైంది. ఇటీవల కూడా తీహార్ జైలులో జరిపిన తనిఖీల్లో 33 మొబైల్ ఫోన్లు బయటపడ్డాయి.
Also Read :Arvind Kejriwal : బరువు తగ్గిన కేజ్రీవాల్.. కాసేపట్లో ఢిల్లీ హైకోర్టులో కీలక విచారణ
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వర్గాలు కీలక వివరాలను వెల్లడించాయి. ఇప్పుడు కేజ్రీవాల్ అస్వస్థతతో ఉన్నారని, మార్చి 21న అరెస్ట్ అయినప్పటి నుంచి ఆయన 4.5 కిలోల బరువు తగ్గారని తెలిపాయి. ఈవివరాలన్నీ తీహార్ జైలు అధికారులు బయటపెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అరవింద్ కేజ్రీవాల్ బ్లడ్ షుగర్ లెవల్ గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులకు లోనవుతోందన్నారు. ఒకానొక దశలో బ్లడ్ షుగర్ లెవల్ 50 కంటే తక్కువకు పడిపోయిందని ఆప్ వర్గాలు చెప్పాయంటూ జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌పై ఇవాళ విచారణ జరగనుంది. తనకు బెయిల్ ఇప్పించాలని అరవింద్ కేజ్రీవాల్ కోర్టును కోరారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారించనున్నారు. దీనిపై హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో వేచిచూడాలి.