Site icon HashtagU Telugu

223 Employees Sacked : 223 మంది మహిళా కమిషన్‌ ఉద్యోగుల తొలగింపు.. సంచలన ఆదేశాలు

223 Employees Sacked

223 Employees Sacked

223 Employees Sacked : ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సంచలన ఆదేశాలు ఇచ్చారు.  ఢిల్లీ మహిళా కమిషన్‌లోని 223 మంది ఉద్యోగులను తక్షణమే తొలగిస్తూ ఆయన ఆర్డర్ ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా అప్పటి ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ ఈ ఉద్యోగులను నియమించారని లెఫ్టినెంట్ గవర్నర్ ఆరోపించారు. ఢిల్లీ మహిళా కమిషన్‌కు 40 పోస్టులే మంజూరవగా.. స్వాతి మలివాల్ ఛైర్‌పర్సన్‌గా ఉన్న టైంలో ఏకంగా 223 మందిని  నియమించారని చెప్పారు. కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన ఉద్యోగులను నియమించుకునే అధికారం ఢిల్లీ మహిళా కమిషన్‌కు లేదని ఆయన స్పష్టం చేశారు.