Supreme Court : న్యాయవ్యవస్థ సమగ్రతకు ముప్పు..500 మంది న్యాయవాదుల సంచలన లేఖ

  • Written By:
  • Publish Date - March 28, 2024 / 11:44 AM IST

 

Supreme Court: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(Chief Justice)కి దాదాపు 500 మందికిపైగా న్యాయవాదులు(Lawyers) లేఖ(letter) రాశారు. న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ లేఖ రాశారు. న్యాయస్థానాల కోసం నిలబడాల్సిన సమయం ఆసన్నమైందని లేఖలో పేర్కొన్నారు. లేఖ రాసిన వారిలో ప్రముఖ న్యాయవాది హరీశ్‌ సాల్వే, మనన్‌ కుమార్‌ మిశ్రా, ఆదిష్‌ అగర్వాల్‌, చేతన్‌ మిట్టల్‌, పింకీ ఆనంద్‌, హితేష్‌ జైన్‌, ఉజ్వల వార్‌, ఉదయ్‌ హోల్లా, స్వరూపమా చతుర్వేది, సహా దేశవ్యాప్తంగా 500 మందికిపైగా న్యాయవాదులు లేఖ రాశారు. న్యాయవ్యవస్థ సమగ్రతకు ముప్పు వాటిల్లుతుందని లేఖలో ఈ లాయర్లు ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని ‘ప్రత్యేక బృందాలు’ న్యాయ ప్రక్రియను ప్రభావితం చేయడానికి.. కోర్టు నిర్ణయాలను ప్రభావితం చేయడానికి ‘కొన్ని ప్రత్యేక బృందాలు’ ప్రయత్నిస్తున్నాయని న్యాయవాదులు ఆరోపించారు.

We’re now on WhatsApp. Click to Join.

రాజకీయ ఉద్దేశాలతో ఈ వర్గాలు నిరాధార ఆరోపణలు చేస్తూ న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నాయని లేఖలో ఆరోపించారు. న్యాయవ్యవస్థపై తప్పుడు కథనాలను ప్రచారం చేయడంతో పాటు, ప్రస్తుత విచారణలను కించపరచడం.. న్యాయస్థానాలపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారని న్యాయవాదులు లేఖలో ప్రస్తావించారు. న్యాయవ్యవస్థను ప్రభావితం చేయడానికి, న్యాయస్థానాలను అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థ సమగ్రతను కాపాడేందుకు ఈ దాడులకు వ్యతిరేకంగా రక్షణ చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ను కోరారు. సవాళ్లను పరిష్కరించడంలో నిర్ణయాత్మక నాయకత్వాన్ని కోరుతూ.. ప్రజాస్వామ్యానికి బలమైన స్తంభంగా ఉండేలా న్యాయవ్యవస్థకు మద్దతుగా ఐక్యంగా నిలబడాలని లేఖలో న్యాయవాదు కోరారు.

Read Also:   MGNREGA: ఉపాధి హామీ కూలీల‌కు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. వేత‌న రేటు పెంపు..!