Rahul Gandhi : రాహుల్‌ గాంధీతో రైతు సంఘాల నేతలు భేటి

కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ) విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు రైతుల రాహుల్‌ గాంధీతో భేటి అయ్యారు.

  • Written By:
  • Publish Date - July 24, 2024 / 04:24 PM IST

Rahul Gandhi: నేడు పార్లమెంట్‌ కాంప్లెక్స్‌లో కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీతో రైతు సంఘాల నేతలు( farmers associations Leaders) సమావేశమయ్యారు. మరో మరోసారి తమ డిమాండ్లు నెరవేర్చాలని రైతుల సంఘాలు నిరసనకు సిద్ధమవుతున్నాయి. కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ) విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు రైతుల రాహుల్‌ గాంధీతో భేటి అయ్యారు.

We’re now on WhatsApp. Click to Join.

తెలంగాణ, పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 12 మంది రైతు నాయకుల ప్రతినిధుల బృందంతో రాహుల్‌ సమావేశమయ్యారు. వీరితో పాటు ఎంపీలు అమరీందర్ సింగ్ రాజా వారింగ్, సుఖ్‌జిందర్ సింగ్ రంధావాతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు కెసి వేణుగోపాల్, దీపేందర్ సింగ్ హుడా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Read Also: Cucumber: కీర దోసకాయను ఆ సమస్యలు ఉన్నవారు అస్సలు తినకూడదట!

తమ చిరకాల డిమాండ్‌ అయిన కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించేలా ప్రైవేటు మెంబర్ బిల్లు ప్రవేశపెట్టాలని రాహుల్ గాంధీని కోరారు. మద్దతు ధర కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామని వారికి కాంగ్రెస్ అగ్రనేత హామీ ఇచ్చారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించే విషయంలో ఇండియా కూటమి తరఫున కేంద్రంపై ఒత్తిడి తీసుకు వస్తామని రాహుల్‌ గాంధీ అన్నారు.

మరోవైపు ఆగస్టు 15న దేశవ్యాప్తంగా తమ డిమాండ్ల సాధన కోసం ట్రాక్టర్‌ ర్యాలీ నిర్వహించనున్నట్లు రైతు నేతలు వెల్లడించారు. కొత్త క్రిమినల్ చట్టాల ప్రతులను కూడా దగ్ధం చేయనున్నట్టు తెలిపారు. ఆగస్ట్ 31న ‘ఢిల్లీ ఛలో’ మార్చ్ 200 రోజులు పూర్తి చేసుకుంటుందన్నారు. ఆ రోజున పంజాబ్, హర్యానా సరిహద్దులోని ఖనౌరి, శంభు, తదితర ప్రాంతాలకు ప్రజలు చేరుకోవాలని సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దార్ మర్చా నేతలు పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 1న ఉత్తరప్రదేశ్‌లోని సంభల్ జిల్లాలో మెగా ర్యాలీ నిర్వహించనున్నట్టు ప్రకటించారు.

Read Also: CM Revanth Reddy : గిరిజన బాలికకు తెలంగాణ సీఎం సాయం

 

 

 

Follow us