ATM Withdrawal: ఖాతాదారులు ఏదైనా బ్యాంకులో ఖాతా తెరవడంతో పాటు నెట్ బ్యాంకింగ్, ఏటీఎం కార్డు పొందడం సర్వసాధారణం. ఈ రోజుల్లో ప్రజలు నగదు విత్‌డ్రా కోసం బ్యాంకుకు వెళ్లే బదులు ATM నుండి డబ్బు తీసుకోవడానికి (ATM Withdrawal) ఇష్టపడుతున్నారు. ఖాతాదారులు ఏదైనా బ్యాంక్ ATM నుండి నగదు తీసుకోవచ్చు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే.. దీని కోసం వివిధ బ్యాంకులు వేరొక బ్యాంకు ATM నుండి ఉచిత లావాదేవీ పరిమితిని నిర్ణయించాయి.
ATM నుండి నగదు ఉపసంహరణకు ఎంత వసూలు చేస్తారు?
జూన్ 2022లో ATM కార్డ్‌ల కోసం నెలవారీ రుసుము కాకుండా కస్టమర్‌లు ప్రతి లావాదేవీకి రూ. 21 వసూలు చేయవచ్చని భారతీయ రిజర్వ్ బ్యాంక్ బ్యాంకులను ఆదేశించింది. మీ బ్యాంక్ ATM నుండి మొదటి ఐదు లావాదేవీలు కస్టమర్లకు పూర్తిగా ఉచితం అని గమనించాలి. అదే సమయంలో మెట్రో నగరాల్లోని ఇతర బ్యాంకులకు మూడు లావాదేవీల పరిమితిని నిర్ణయించారు. మరోవైపు, నాన్-మెట్రో నగరాల్లో ఈ పరిమితి ఐదు లావాదేవీల పరిమితిని నిర్ణయించారు. ఈ లావాదేవీ కంటే ఎక్కువ చేసిన తర్వాత మీరు ఒక్కో ఉపసంహరణకు గరిష్టంగా రూ. 21 రుసుమును చెల్లించాలి. ఈ నిబంధన జనవరి 1, 2022 నుండి అమల్లోకి వచ్చింది.
Also Read: Domino Tower Falls : కూలిపోవడం ఇంత అందంగా ఉంటుందా.. గిన్నిస్ రికార్ డొమినో టవర్ కూల్చివేత..
SBI ATM ఉపసంహరణ ఛార్జీలు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెలవారీ బ్యాలెన్స్ రూ.25,000 వరకు 5 ఉచిత ATM లావాదేవీలను అందిస్తుంది. అదే సమయంలో దీని కంటే ఎక్కువ విత్‌డ్రా చేస్తే మీరు ఒక్కో లావాదేవీకి రూ.10, GST చెల్లించాలి. అదే సమయంలో మీరు ఇతర బ్యాంకుల ATMలలో రూ. 20, GST చెల్లించాలి. మీ నెలవారీ బ్యాలెన్స్ రూ. 25,000 కంటే ఎక్కువ ఉంటే మీరు ATM నుండి మీకు కావలసినన్ని సార్లు ఉచితంగా నగదు తీసుకోవచ్చు.
PNB ATM ఉపసంహరణ ఛార్జీలు
దేశంలోని రెండవ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన PNB.. మెట్రో, నాన్-మెట్రో నగరాల్లోని తన వినియోగదారులకు 5 ఉచిత ATM లావాదేవీలను అందిస్తుంది. దీని తర్వాత మీరు PNB నుండి నగదు ఉపసంహరణపై రూ. 10, GST ఛార్జీలను చెల్లించాలి. అదే సమయంలో ఇతర బ్యాంకుల్లో రూ.21, జీఎస్టీ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
HDFC బ్యాంక్ ఉపసంహరణ ఛార్జీలు
పెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కూడా తన కస్టమర్‌లకు నెలలో 5 ఎటిఎం లావాదేవీలను ఉచితంగా చేసే సౌకర్యాన్ని అందిస్తుంది. మరోవైపు ఈ పరిమితి మెట్రో నగరంలో ఇతర బ్యాంకుల్లో 3 లావాదేవీలు. దీని తర్వాత మీరు ప్రతి లావాదేవీకి రూ. 21, GST ఛార్జీలు చెల్లించాలి.
ICICI బ్యాంక్ ఉపసంహరణ ఛార్జీలు
ఇతర బ్యాంకుల మాదిరిగానే ICICI బ్యాంక్ కూడా ICICI బ్యాంక్ ATMల నుండి 5 లావాదేవీలు, ఇతర బ్యాంకుల ATMల నుండి 3 లావాదేవీల పరిమితిని నిర్ణయించింది. దీని తర్వాత ఖాతాదారులు విత్‌డ్రాకు రూ.20, ఆర్థికేతర లావాదేవీలకు రూ.8.50 చెల్లించాలి.