RS.2000 Notes: రూ. 2000 నోట్ల మార్పిడికి నేడే చివరి రోజు

2016 నవంబర్ 8వ తేదీ సరిగ్గా సాయంత్రం 7 గంటల ప్రాంతంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ..పెద్దనోట్లను రద్దు చేస్తున్నట్టు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

RS.2000 Notes: 2016 నవంబర్ 8వ తేదీ సరిగ్గా సాయంత్రం 7 గంటల ప్రాంతంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ..పెద్దనోట్లను రద్దు చేస్తున్నట్టు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయంతో రూ.1000 మరియు రూ.500 నోట్లు రద్దు అయ్యాయి. మోడీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఆర్ధిక వ్యవస్థను ఓ కుదుపు కుదిపేసింది. ప్రపంచ దేశాలు సైతం ఆశ్చర్యపడ్డాయి. ఈ నిర్ణయంతో నోట్ల కష్టాలతో దేశప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటల తరబడి క్యూ లైన్ లో నిలుచుని కొందరు ప్రాణాలను సైతం పోగొట్టుకున్నారు. మొత్తానికి ఈ నిర్ణయం ద్వారా దేశానికి వచ్చిన లాభం ఏమీ లేదని తేలింది.

పెద్దనోట్లను రద్దు చేస్తానని చెప్పి రద్దైన పెద్ద నోట్లకంటే మరింత పెద్ద నోటుతో షాకిచ్చారు మోడీ. ఏకంగా రూ.2000 నోటును తీసుకొచ్చారు. ఈ నోటు ద్వారా మధ్యతరగతి వాళ్ళు అనేక ఇబ్బందులు పడ్డారు. ఈ నోటు ద్వారా మోడీ ధనికులకు మేలు చేసినట్లయింది. ఓ రకంగా డెమోనిటైజేషన్ ద్వారా మోడీ విమర్శలు మూటగట్టుకున్నారు. ఇదిలా ఉండగా ఈ రోజుతో రూ.2000 నోటికి కూడా కాలం చెల్లింది. 2000 నోటు రేపటి నుంచి చెలామణిలో ఉండదు. ఈ రోజు చివరి రోజు కావడంతో ఏటీఎంలు, బ్యాంకుల వద్ద బారులు తీరుతున్నారు. అయితే అందులో సామాన్యులు లేకపోవడం విశేషం.

రూ.2000 నోటుని బ్యాంకులో మార్చుకోవాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. గత నెల ప్రారంభంలో ఆర్‌బిఐ అధిక విలువ గల నోట్లను చలామణి నుండి ఉపసంహరించుకోవాలని సెంట్రల్ బ్యాంక్ నిర్ణయించినప్పటి నుండి రూ.2,000 నోట్లలో 93 శాతం బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చినట్లు తెలిపింది. ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2,000 నోట్లను బ్యాంకు , ఆర్‌బీఐ ప్రాంతీయ శాఖల్లో మార్చుకోవాలని లేదా డిపాజిట్ చేయాలని సూచించారు. ఖాతా లేని వ్యక్తి కూడా ఏదైనా బ్యాంక్ బ్రాంచ్‌లో ఒకేసారి రూ. 2000 నోట్లను రూ. 20,000 పరిమితి వరకు మార్చుకోవచ్చు.

Also Read: NTR Ghat Issue : స్వ‌ర్గీయ ఎన్టీఆర్ పై మంత్రి KTR `షేడ్స్ `