Site icon HashtagU Telugu

PAN Card: పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేయడానికి తుది గడువు మార్చి 31..!

PAN Aadhaar

Pan Adhar

పాన్‌తో ఆధార్‌ను (PAN- Aadhaar) అనుసంధానం చేసుకోని వారు వచ్చే ఏడాది మార్చి 31లోపు ఆ ప్రక్రియ పూర్తి చేయాలని మరోసారి గుర్తుచేసింది. లేదంటే పాన్‌ కార్డు నిరుపయోగంగా మారిపోతుందని పేర్కొంది. ఈ మేరకు ఐటీ శాఖ ట్విటర్‌ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది. ‘‘ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం మినహాయింపు పరిధిలోకి రాని పాన్‌కార్డు హోల్డర్లంతా తమ పాన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి. ఇందుకు 2023 మార్చి 31 వరకు మాత్రమే గడువు ఉంది. ఒకవేళ అనుసంధానం పూర్తి చేయకపోతే మీ పాన్‌ నిరుపయోగంగా మారిపోతుంది. గడువు తేదీ దగ్గరపడుతోంది కాబట్టి ఇవాళే అనుసంధానం పూర్తి చేయండి’’ అని తన ట్విటర్‌లో పేర్కొంది.

పాన్‌తో ఆధార్‌ అనుసంధానం పూర్తి చేయాలంటే మీరు వెయ్యి రూపాయలు ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే గడువు ముగిసిన నేపథ్యంలో ప్రస్తుతం పెనాల్టీతో అనుసంధానానికి అనుమతిస్తున్నారు. ఒకవేళ నిర్దేశించిన గడువులోగా ఆ ప్రక్రియ పూర్తి చేయపోతే పాన్‌ నిరుపయోగంగా మారి బ్యాంక్‌ ఖాతాలు గానీ, డీమ్యాట్‌ అకౌంట్‌ గానీ తెరవడానికి సాధ్యపడదు.

ఎలా చెల్లించాలి..?

Also Read:  Arunachalam History: అరుణాచలం ఆలయ చరిత్ర..