Site icon HashtagU Telugu

Land Scam Case: ఢిల్లీలో హేమంత్ సోరెన్‌ను విచారిస్తున్న ఈడీ

Land Scam Case

Land Scam Case

Land Scam Case: జార్ఖండ్‌లోని భూ కుంభకోణం కేసులో సీఎం హేమంత్ సోరెన్‌ను ఈడీ విచారిస్తోంది. అంతకుముందు ఈడీ అధికారులు సీఎం హేమంత్ కు తొమ్మది సార్లు సమన్లు పంపారు. 7 సార్లు సమన్లను భేఖాతర్ చేసిన సీఎం ఎనిమిదో సారి తనకు ఈడీ నుంచి లేఖ అందిందని స్పందించాడు. అయితే జనవరి 27 నుంచి 31వ తేదీ మధ్య విచారణకు సహకరించాలని ఈడీ సీఎంని కోరింది. దానికి బదులుగా పరిశీలిస్తున్నామని, ఎప్పుడు, ఎక్కడ విచారించవచ్చో తర్వాత చెబుతామని చెప్పారు. విచారణకు సీఎం సహకరించకపోవడంతో ఈ రోజు పకడ్బందీగా విచారిస్తుంది.

కొద్దీ సేపటి క్రితమే ఢిల్లీలోని ఆయన నివాసానికి ఈడీ అధికారులు చేరుకున్నారు. నిన్న శనివారమే ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఢిల్లీకి వచ్చారు. ఈ నేపథ్యంలో రాంచీలోని ఆయన నివాసం, ఈడీ కార్యాలయానికి భద్రతను పెంచారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు సంబంధించి చీఫ్ సెక్రటరీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సహా ఉన్నతాధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

మైనింగ్‌ స్కాంలో 1,000కోట్ల కుంభకోణం జరిగిందని జార్ఖండ్‌ సీఎం హేమంత్‌సోరెన్‌పై ఈడీ అభియోగాలు మోపింది. కాగా సీఎం హేమంత్ మాత్రం తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చారు.బీజేపీ కేంద్రం ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోందని మొదటి నుంచి చెప్తూనే ఉన్నాడు. ఈ కేసులో ఇప్పటికే 14 మందిని ఈడీ అరెస్ట్‌ చేసింది. అక్రమంగా మైనింగ్‌ లీజుల్లో ల్యాండ్‌ స్కాం జరిగిందని ఈడీ ఆరోపిస్తోంది.

ఢిల్లీలోని ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నివాసానికి ఈడీ బృందం విచారణ నిమిత్తం చేరగా ఢిల్లీలోని హేమంత్ నివాసంలో కూడా పోలీసు అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు సంబంధించి, చీఫ్ సెక్రటరీ ఎల్ ఖ్యాంగ్టే ఉదయం 10.15 గంటలకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌తో సహా సీనియర్ అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రధాన కార్యదర్శి నివాసంలో ఈ సమావేశం జరగనుంది.

Also Read: AP Political Parties Campaign : మరికొద్ది రోజుల్లో ఏపీలో నేతల ప్రచారం..అంత

కు మించి