Site icon HashtagU Telugu

Lalu’s Daughter’s Tweet: కిడ్నీ ఇచ్చే ముందు లాలూ కుమార్తె ట్వీట్..

Lalu Daughter'

Lalu Daughter'

రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు కిడ్నీ మార్పిడి చికిత్స సోమవారం సింగపూర్ దేశంలో జరుగుతోంది. లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య, ఈరోజు అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రికి, తన కిడ్నీని దానం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీకి కొద్ది క్షణాల ముందు రోహిణి ట్విట్టర్‌లో హాస్పిటల్ బెడ్‌పై నుంచి తన చిత్రాన్ని పంచుకుంది.

నా కిడ్నీని దానం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, నాకు శుభం జరగాలని కోరుకుంటున్నాను అని రోహిణి ట్వీట్ చేసింది. ‘‘మేం దేవుడిని చూడలేదు, కానీ దేవుడు లాగా ఉన్న మా నాన్నను చూశాం’’ అని రోహిణి ట్విట్టర్‌లో రాశారు. లాలూ యాదవ్ రెండో కూతురు రోహిణి తన తండ్రికి కిడ్నీ దానం చేయడం తన అదృష్టమని రోహిణి పేర్కొన్నారు.‘‘ మా అమ్మా నాన్నలు నాకు దేవుడిలాంటి వారు. వారి కోసం నేను ఏమైనా చేయగలను అని రోహిణి పేర్కొన్నారు.

 

 

Exit mobile version