Site icon HashtagU Telugu

Sand Mining Case: ఆర్జేడీ చీఫ్ కు ఈడీ షాక్, సన్నితుడు అరెస్ట్

Sand Mining Case

Sand Mining Case

Sand Mining Case: బ్రాడ్‌సన్ కమోడిటీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ సుభాష్ యాదవ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నిన్న శనివారం సుదీర్ఘంగా విచారించింది. కాగా మరింత సమాచారం రాబట్టేందుకు ఈడీ అతనిని అదుపులోకి తీసుకుంది. ఇసుక సిండికేట్‌ కేసులో ఇప్పటి వరకు ఇది 5వ అరెస్టు.

సుభాష్‌కు చెందిన అరడజనుకు పైగా ప్రాంతాల్లో శనివారం సోదాలు జరిగాయి. సోదాలు భాగంగా రూ.2 కోట్ల నగదుతో పాటు, భూమికి సంబంధించిన పత్రాలు మరియు పెట్టుబడికి సంబంధించిన పత్రాలను ఈడీ స్వాధీనం చేసుకుంది. అక్రమ ఇసుక వ్యాపారం, మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేశారు.

దానాపూర్‌లోని సుభాష్‌ యాదవ్‌ నివాసంతో పాటు మానేర్‌లోని మార్చియాదేవి అపార్ట్‌మెంట్‌, దానాపూర్‌లోని వాటర్‌ ప్లాంట్‌, షాహ్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కార్యాలయం తదితర ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. దీంతోపాటు పెట్టుబడులు, భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు పెద్దఎత్తున బయటపడ్డాయి. పత్రాలను పరిశీలించిన తర్వాత సంపాదించిన ఆస్తుల వివరాలపై ఈడీ ప్రశ్నించనుంది.సుభాష్ యాదవ్ బ్రాడ్‌సన్ కన్‌స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ గా ఉన్నారు.

సుభాష్ ఆర్జేడీ అధినేత లాల్ ప్రసాద్ యాదవ్ కి అత్యంత సన్నిహితుడని చెబుతారు. ఆయన గతంలో రాష్ట్రీయ జనతాదళ్ టిక్కెట్‌పై ఛత్రా లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు. ఇసుక వ్యాపారి సుభాష్ యాదవ్ కు సంబందించిన వేర్వేరు ప్రాంతాల్లో దాడులు చేయడం ఇదే తొలిసారి కాదు. ఇంతకు ముందు కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌తో పాటు సీబీఐ, ఆదాయపు పన్ను శాఖ బృందాలు వారి స్థలాల్లో సోదాలు నిర్వహించాయి.

Also Read: Miss World 2024 : ప్రపంచ సుందరి క్రిస్టినా పిస్కోవా గొప్ప పనులు.. తెలుసా ?