Lalu Prasad Offer : బిహార్ పాలిటిక్స్‌లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. బిహార్ సీఎం నితీష్ కుమార్‌కు చెందిన జేడీయూ పార్టీ, లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన ఆర్జేడీ పార్టీతో తెగదెంపులు చేసుకుంది. మళ్లీ ఎన్డీఏ కూటమిలో నితీష్ చేరడం ఖాయమైంది. బీజేపీ అగ్రనేతలతో నితీష్ భేటీ అయినట్లు తెలుస్తోంది. జేడీయూ, ఆర్జేడీ పార్టీల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. దీంతో మరోసారి నితీష్ కుమార్ తన పాత స్నేహితుడైన బీజేపీ సాయంతో అధికారాన్ని చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. నితీష్‌ను నిలువరించేందుకు లాలూ కూడా పావులు కుదుపుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన ఎమ్మెల్యేల బలాన్ని కూడగట్టడంపై లాలూ(Lalu Prasad Offer) కూడా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.
We’re now on WhatsApp. Click to Join.
రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే మ్యాజిక్ ఫిగర్ 122 మార్కును చేరుకోవాలి. అయితే ప్రస్తుతం ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలన్నింటికి కలిపి మరో 8 మంది ఎమ్మెల్యేలు తక్కువగా ఉన్నారు. దీంతో ఇతర పార్టీలు, స్వతంత్రులకు తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న మాజీ బీహార్ సీఎం జితన్ రామ్ మాంఝీ కుమారులు తమ మహాఘటబంధన్ లో చేరితో లోక్‌సభ స్థానాలతో పాటు ఉపముఖ్యమంత్రి పదవికి కూడా లాలూ ఆఫర్ ఇచ్చినట్లు వెల్లడించారు. అయితే, దీనిపై సంతోష్ మాంఝీ మాట్లాడుతూ.. తాము అలాంటి ఆఫర్లకు లొంగిపోమని, మేం ఎన్డీయేతో కలిసి ఉన్నామని, ఇలాంటి ఆఫర్లు వస్తూనే ఉంటాయని ఆయన అన్నారు.
Also Read :Medaram Jatara 2024 : మేడారం సమ్మక్క కుంకుమ భరిణెగా ఎందుకు మారారు ?
బీహార్ అసెంబ్లీలో బలాబలాలు(243 సీట్లు)
- ఆర్జేడీ-79
- బీజేపీ-78
- జేడీయూ-45
- కాంగ్రెస్-19
- వామపక్షాలు-16
- హెచ్ఏఎం(ఎస్)-4
- ఎంఐఎం-1
- ఇండిపెండెంట్-1
నితీష్ ముందు రెండు దారులు..
బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ ఇండియా కూటమికి బైబై చెప్పి.. మళ్లీ ఎన్డీఏ గూటిలో చేరబోతున్నారు. ఇప్పటికే మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్‌లు ఇండియా బ్లాక్‌తో సంబంధాలను తెంచుకోగా.. ఇప్పుడు నితీష్ కూడా అదే బాటలో కనిపిస్తున్నారు. ఎన్డీఏతో తన కలయికకు సంకేతంగా ఫిబ్రవరి 4న బిహార్‌లోని బెట్టియాలో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోడీతో కలిసి నితీష్ కుమార్(Nitish With Modi) వేదికను పంచుకునే ఛాన్స్ ఉంది. త్వరలో బీజేపీతో జట్టుకట్టిన తర్వాత బిహార్ అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు పోయేందుకు నితీష్ కుమార్ రెడీ అవుతారని తెలుస్తోంది. రాబోయే లోక్‌సభ ఎన్నికలతో పాటే బిహార్ అసెంబ్లీ పోల్స్ జరుగుతాయని తెలుస్తోంది. మరో వాదన ప్రకారం.. 243 మంది సభ్యుల బీహార్ అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు 122 సీట్ల బలం అవసరం. ఇందులో ఆర్జేడీకి అత్యధికంగా 79 సీట్లు ఉన్నాయి. బీజేపీకి 82 సీట్లు, నితీష్ కుమార్ జేడీయూ పార్టీకి 45 సీట్లు ఉన్నాయి. బీజేపీ, జేడీయూ కలిసి కొత్త సర్కారును ఏర్పాటు చేస్తాయనే అంచనాలు కూడా వెలువడుతున్నాయి. బిహార్‌లో అసెంబ్లీ రద్దవుతుందా ? బీజేపీ, జేడీయూ కలయికతో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందా ? అనేది ఇంకొన్ని రోజుల్లోనే తేలిపోతుంది.