Site icon HashtagU Telugu

Lalit Modi : లండన్‌లో లలిత్ మోదీ గ్రాండ్ పార్టీ.. చిందిలేసిన విజయ్ మాల్యా

Lalit Modi

Lalit Modi

Lalit Modi : భారత ఆర్థిక చట్టాల నుంచి తప్పించుకుని లండన్‌కు పారిపోయిన వ్యాపారవేత్తలు లలిత్ మోదీ, విజయ్ మాల్యా మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. తాజాగా లండన్‌లో జరిగిన ఓ విలాసవంతమైన ప్రైవేట్ పార్టీలో వీరిద్దరూ కలిసి పాటలు పాడుతూ సరదాగా గడిపిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ఈ పార్టీకి ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ స్వయంగా ఆతిథ్యం ఇచ్చారు. సుమారు 310 మంది అతిథులు హాజరైన ఈ కార్యక్రమంలో విజయ్ మాల్యా, లలిత్ మోదీ కలిసి ‘ఐ డిడ్ ఇట్ మై వే’ అనే పాటను ఆలపించారు. వారితో కలిసి వెస్టిండీస్‌ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్ కూడా పార్టీలో పాల్గొన్నాడు. అతడు ఈ వేడుకలో మోదీ, మాల్యాతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

ఈ వీడియోను లలిత్ మోదీ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేస్తూ, “ఈ వీడియో ఇంటర్నెట్‌ను బ్రేక్ చేయదేమో. కానీ నేను చేసేది ఇదే” అనే క్యాప్షన్ పెట్టడం ద్వారా తన ధిక్కార ధోరణిని బయటపెట్టాడు.

గమనించాల్సిన విషయం ఏమిటంటే, లలిత్ మోదీ ప్రస్తుతం మనీలాండరింగ్ తదితర ఆర్థిక అక్రమాల కేసులతో 2010 నుంచి లండన్‌లోనే ఉంటున్నారు. మరోవైపు విజయ్ మాల్యా భారతీయ బ్యాంకులకు సుమారు 9,000 కోట్లు ఎగ్గొట్టి లండన్‌కు పారిపోయారు. ఆయనపై మోసం, మనీలాండరింగ్ కేసులు కొనసాగుతున్నాయి.

వీరిద్దరినీ భారత్‌కు తీసుకొచ్చేందుకు ప్రభుత్వ ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ, వారు విదేశాల్లో ఇలా లగ్జరీ లైఫ్ గడుపుతూ బహిరంగంగా సంబరాలు చేసుకుంటూ కనిపించడం చర్చనీయాంశంగా మారింది.

Kavitha : ఆసుపత్రికి ఎమ్మెల్సీ కవిత.. కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆరా