Lal Bihari Vs Modi : ప్రధానమంత్రి నరేంద్రమోడీ పోటీ చేస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ స్థానంలో రసవత్తర పోరు నెలకొంది. అక్కడి నుంచి ఇప్పటికే హిజ్రా మహామండలేశ్వర్ హేమాంగి సఖి బరిలోకి దిగారు. ఆమెకు ప్రపంచంలోనే తొలి ట్రాన్స్‌జెండర్ భగవద్గీత బోధకురాలిగా గుర్తింపు పొందింది. ఇప్పుడు తాజాగా మరో అభ్యర్థి కూడా మోడీపై పోటీకి రెడీ అయ్యారు. ఆయన పేరే లాల్ బిహారీ(Lal Bihari Vs Modi). ఇంతకీ ఆయన ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join
లాల్ బిహారీ.. ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్ జిల్లా వాస్తవ్యులు. ఆయన 1976లో చనిపోయినట్లు ప్రభుత్వ రికార్డుల్లో అధికారులు నమోదు చేశారు. ఈ రికార్డులను మార్పించేందుకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ లాల్ బిహారీ చక్కర్లు కొట్టారు. అయినా ఎలాంటి ఫలితం రాలేదు. దీంతో జీవించి ఉన్నానని నిరూపించుకునేందుకు లాల్ బిహారీ.. బడా రాజకీయ నాయకులపై ఎన్నికల్లో పోటీ చేశారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ రికార్డుల నుంచి తన పేరు తొలగింపు విషయంపై 18 ఏళ్లపాటు లాల్ బిహారీ న్యాయపోరాటం చేయగా.. 1994లో అలహాబాద్ హైకోర్టు అనుకూల తీర్పు ఇచ్చింది.
Also Read :Geetanjali Malli Vacchindi : అంది వచ్చిన ఛాన్స్.. అందుకుంటారా.. వదిలేస్తారా..?
- 1988 లోక్‌సభ ఎన్నికల్లో అలహాబాద్ స్థానం నుంచి దివంగత మాజీ ప్రధాని వీపీ సింగ్‌పై పోటీ చేసి ఓడిపోయారు. ఈ స్థానంలో అప్పటికే ఎంపీగా కొనసాగుతున్న బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ రాజీనామా చేయడంతో అలహాబాద్‌లో ఉపఎన్నిక జరిగింది.
- తదుపరి ఎన్నికల్లో అమేథీ నుంచి దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీతో లాల్ బిహారీ తలపడి ఓడిపోయారు. అయినాసరే ఎన్నికల్లో పోటీ చేయడాన్ని లాల్ బిహారీ మానలేదు.
- 2004లో అజంగఢ్‌లోని లాల్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కూడా ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు.
- 1991, 2002, 2007 సంవత్సరాల్లోనూ ఇదే జిల్లాలోని ముబారక్‌పుర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సైతం ఎన్నికల బరిలో లాల్ బిహారీ నిలిచారు.
- ఇక ఇప్పుడు వారణాసి లోక్‌సభ స్థానం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పైనా ఆయన పోటీ చేస్తున్నారు.త్వరలోనే నామినేషన్ పత్రాలను కూడా దాఖలు చేయనున్నారు.
- ట్రాన్స్‌జెండర్ మహామండలేశ్వర్ హేమాంగి సఖి కూడా ప్రధాని మోడీపై పోటీ చేస్తున్నారు. అఖిల భారత హిందూ మహాసభ తరఫున ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈరోజు(ఏప్రిల్ 10) నుంచి హేమాంగి వారణాసిలో ఎన్నికల ప్రచారం చేస్తారట.