SI kidnapped: మగ ఎస్ఐ ను కిడ్నాప్ చేసిన లేడీ కానిస్టేబుల్స్.. ఏం జరిగిందంటే!

యూపీలో ఓ ఘటనలో ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్ మగ ఎస్ ఐ ను కిడ్నాప్ చేశారు.

  • Written By:
  • Updated On - December 5, 2022 / 02:45 PM IST

సొసైటీలో జరిగే కొన్ని నేరాలు (Crimes) అనేక మలుపులు తిరుగుతుంటాయి. శాంతి భద్రతలు కాపాడే పోలీసులు సైతం నేరాలకు (Crimes) పాల్పడిన ఘటనలు సైతం చోటుచేసుకుంటున్నాయి. ఉత్తర ప్రదేశ్ స్టేట్ లో ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్ ఓ మగ ఎస్ ఐ ని కిడ్నాప్ చేశారనే ఆరోపణలు ఆ రాష్ట్రంలో చర్చనీయాంశమవుతోంది. ఉత్తర ప్రదేశ్ లోని సుల్తాన్‌పూర్‌లోని మహిళా ఠాణాలో మగ పోలీసు ఇన్‌స్పెక్టర్ తోమర్ విధులు నిర్వహిస్తున్నాడు. ఆయనతో పాటు ఇద్దరు లేడీ కానిస్టబుల్స్ కూడా విధలు నిర్వహిస్తున్నాు. అయితే జులైలో ఇద్దరి మహిళా కానిస్టేబుల్స్ ఒకరు, తనపై ఎస్ఐ అత్యాచారం చేశాడని ఆరోపించింది. అయితే ఇన్‌స్పెక్టర్‌ని ఆ ఇద్దరు లేడీ కానిస్టేబుల్ కిడ్నాప్ చేశారనే ఆరోపణలపై మరో కేసు  కూడా నమోదైంది.

ఎస్ఐ అడ్రస్ గల్లంతు

అత్యాచార ఆరోపణల నేపథ్యంలో ఇన్‌స్పెక్టర్ (SI) తోమర్‌పై కేసు నమోదు కావడంతో సస్పెండ్ అయ్యాడు. దీంతో ఆయన కేసు కారణంగా సుల్తాన్‌పూర్‌లోని స్థానిక కోర్టులో లొంగిపోవడానికి వెళ్ళాడు. అక్కడ అతన్ని సెప్టెంబర్ 22న మహిళా ఠాణా ఎస్‌హెచ్‌ఓ మీరా కుష్వాహా అరెస్టు చేశారు. అప్పటి నుండి మగ ఎస్ ఐ కనిపించకుండాపోయాడు. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని తోమర్ భార్య కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల మేరకు లేడీ కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు.

కోర్టు ఆదేశాలు

సుల్తాన్‌పూర్ పోలీసు సూపరింటెండెంట్ సోమెన్ బర్మా మాట్లాడుతూ.. CJM కోర్టు ఆదేశం మేరకు, ఒక వ్యక్తిని కిడ్నాప్ చేయడం లేదా నిర్బంధంలో ఉంచడం, నేరపూరిత కుట్ర (120)తో పాటు చంపేస్తామని బెదిరించడం (364) అనే అభియోగాల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. తన భర్తపై మహిళా కానిస్టేబుల్ అత్యాచార కేసును నమోదు  చేశారని తోమర్ భార్య కుసుమ్ దేవి తెలిపారు. మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు చేయడంతోనే ఆయన సెప్టెంబరు 22న ఆయన కోర్టుకు వెళ్లాడనీ, అప్పట్నుంచి కనిపించకుండాపోయాడని ఎస్ఐ భార్య ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ ఘటన యూపీలో తీవ్ర ఆసక్తిని రేపుతోంది.

Also Read: MLC Kavitha: లిక్కర్ స్కామ్ లో ‘కవిత’ ట్విస్ట్.. సీబీఐ కు షాక్!