Shepherds Vs Chinese Soldiers : చైనా సైనికులను పరుగులు పెట్టించిన లడఖ్ గొర్రెల కాపరులు

Shepherds Vs Chinese Soldiers : మనదేశం బార్డర్‌లో చైనా ఆర్మీ ఆగడాలకు అంతు లేకుండాపోతోంది.

  • Written By:
  • Updated On - January 31, 2024 / 12:48 PM IST

Shepherds Vs Chinese Soldiers : మనదేశం బార్డర్‌లో చైనా ఆర్మీ ఆగడాలకు అంతు లేకుండాపోతోంది. వాస్తవ నియంత్రణ రేఖ (LAC) దగ్గర గొర్రెలను మేపడానికి వెళ్లిన లడఖ్ గొర్రెల కాపరుల బృందాన్ని చైనా సైనికులు అడ్డుకునేందుకు యత్నించారు. ఈక్రమంలో మన దేశ గొర్రెల కాపరులు సాహసంతో ప్రతిఘటించారు.  చైనా ఆర్మీతో గొర్రెలు కాపరులు వాదనకు దిగిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోల ప్రకారం.. మూడు సాయుధ వాహనాలలో చైనా సైనికులు వచ్చి అలారం మోగిస్తూ.. భారత్‌కు చెందిన గొర్రెల కాపరులను వెళ్లిపోవాలని హెచ్చరించారు.  ఈక్రమంలో గొర్రెల కాపరులు, చైనా సైనికుల మధ్య  వాగ్వాదం ముదిరినప్పుడు..  కొందరు గొర్రెల కాపరులు రాళ్లు తీసేందుకు యత్నించడం కనిపించింది. అయితే హింస చెలరేగినట్లు వీడియోలో కనిపించలేదు. వీడియోలో కనిపించిన చైనా సైనికులు(Shepherds Vs Chinese Soldiers) ఆయుధాలు ధరించలేరు.  ‘‘మేం భారత భూభాగంలో ఉన్నాం. ఇక్కడ  గొర్రెలను మేపే హక్కు మాకు ఉంది’’ అని లడఖ్ ప్రాంత గొర్రెల కాపరులు చైనా సైనికులతో వాదించడం వినిపించింది. దీంతో చైనా సైనికులు చేసేదేం లేక వెనక్కి వెళ్లిపోయారు.

We’re now on WhatsApp. Click to Join

2020 సంవత్సరం తర్వాత ఇదే తొలిసారి

2020 సంవత్సరంలో చైనా – పాక్ సైనికుల మధ్య గాల్వాన్ ఘర్షణ తర్వాత స్థానిక గొర్రెల కాపరులు, సంచార జాతుల ప్రజలు ఈ ప్రాంతంలో గొర్రెలను మేపడం మానేశారు. మళ్లీ ఇక్కడ లడఖ్ గొర్రెల కాపరులు జీవాలను మేపేందుకు తీసుకెళ్లడం ఇదే తొలిసారి. 2020లో గాల్వాన్ వ్యాలీలో భారత్, చైనా సైనికుల మధ్య  జరిగిన పెద్ద ఘర్షణలో 20 మంది భారత సైనికులు మరణించారు. తాము నలుగురు సైనికులను కోల్పోయామని చైనా చెబుతుండగా, వారి సంఖ్య చాలా ఎక్కువగానే ఉంటుందని నివేదికలు వచ్చాయి.

Also Read : Tamil Nadu Temples : ఆలయం పిక్నిక్ స్పాట్ కాదు.. హిందూయేతరుల ప్రవేశంపై కోర్టు సంచలన ఆదేశాలు

లడఖ్‌లోని చుషుల్ ప్రాంత  కౌన్సిలర్ కొంచోక్ స్టాంజిన్ దీనిపై స్పందిస్తూ.. స్థానిక గొర్రెల కాపరులు చూపిన ప్రతిఘటనను ప్రశంసించారు. వారికి మద్దతు ఇస్తున్నందుకు భారత సైన్యాన్ని ప్రశంసించారు. ‘‘చైనా ఆర్మీతో పశువుల మేత సమస్యలను పరిష్కరించే విషయంలో భారతదేశ సైనిక దళాలు ఎల్లప్పుడూ లడఖ్ ప్రాంత ప్రజలతో నిలబడ్డాయి. భారత సైన్యం అండతో  మా సంచార జాతులు చైనా ఆర్మీని ధైర్యంగా ఎదుర్కోగలిగాయి’’ అని చుషుల్ ప్రాంత  కౌన్సిలర్  చెప్పారు.  కాగా, వాస్తవ నియంత్రణ రేఖ (LAC) అనేది భారతదేశం, చైనా భూభాగాలను వేరుచేసే ఒక సరిహద్దు రేఖ.

Follow us