Site icon HashtagU Telugu

UP : పోలింగ్ జరిగిన నెక్స్ట్ డేనే బీజేపీ ఎంపీ అభ్యర్థి మృతి ..

Kunwar Sarvesh Kumar Passed

Kunwar Sarvesh Kumar Passed

లోక్ సభ ఎన్నికలు (Lok Sabha Elections) కొనసాగుతున్న వేళ బిజెపిలో విషాదం చోటుచేసుకుంది. ఉత్తర్​ప్రదేశ్​ మురాదాబాద్ లోక్​సభ స్థానం ( Moradabad BJP Lok Sabha Candidate ) కోసం బరిలో దిగిన బీజేపీ సీనియర్ నేత కువర్ సర్వేశ్ కుమార్ మృతి (Kunwar Sarvesh Dies) చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న సర్వేష్ కుమార్.. ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పటల్ లో చికిత్స పొందుతూ మరణించారు. సర్వేష్ కుమార్ మరణాన్ని బీజేపీ యూపీ అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి ధ్రువీకరించారు. ‘ఆయన గొంతులో సమస్య ఉంది. శస్త్ర చికిత్స కూడా జరిగింది. హెల్త్ చెకప్ కోసం శుక్రవారం ఎయిమ్స్ లో చేరారు` అని భూపేంద్ర చౌదరి తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

లోక్​సభ ఎన్నికల తొలి దశలో మురాదాబాద్ నియోజకవర్గానికి శుక్రవారం పోలింగ్ జరిగింది. సర్వేశ్​ కుమార్ ఓటు వేసిన తర్వాత.. ఎయిమ్స్ చికిత్స కోసం చేరారు. ఓటింగ్ జరిగిన తర్వాతే రోజు సర్వేశ్ మరణించడం, ఆయన అనుచరులతోపాటు పార్టీ కార్యకర్తల్లో తీవ్ర విషాదం నింపింది. సర్వేశ్ కుమార్ మృతి పట్ల యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సంతాపం తెలిపారు.

ఠాకూర్ సామాజిక వర్గానికి చెందిన కున్వర్ సర్వేష్ కుమార్.. యూపీ ప్రముఖ రాజకీయ నేతల్లో ఒకరు. ఆయన కుమారుడు కున్వర్ సుశాంత్ సింగ్.. మొరాదాబాద్ లోక్ సభా స్థానం పరిధిలోని బాధాపూర్ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. సర్వేశ్ కుమార్ ఐదు సార్లు యూపీ ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారు. తొలిసారి 1991లో ఠాకూర్ ద్వారా అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అప్పటి నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా కొనసాగారు. 2014లో లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించి, జాతీయ రాజకీయాల్లోకి వెళ్లారు. 2019 ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి ఎస్టీ హసన్ చేతిలో ఓటమి పాలయ్యారు.

Read Also : Jagan : రాయి తగలడం తో జగన్ అంత మరచిపోతున్నాడా..? దీనికి కారణం పవన్ ఫై చేసిన కామెంట్లే..!!