Delhi Election Results : ఫస్ట్ బోణి కొట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ

Delhi Election Results : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి గెలుపు ఆమ్ ఆద్మీ పార్టీని వరించింది. కొండ్లీ నియోజకవర్గం (Kondli Assembly constituency) నుంచి ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్ (Kuldeep Kumar) విజయం సాధించారు

Published By: HashtagU Telugu Desk
Kondli Constituency Kuldeep

Kondli Constituency Kuldeep

దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (Delhi Election Results 2025) ఉత్కంఠ రేపుతున్నాయి. వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) గట్టిగానే ట్రై చేసినప్పటికీ ఓటర్లు మాత్రం బీజేపీకే పట్టం కట్టారని అర్ధం అవుతుంది. ఒకవేళ బిజెపి విజయం సాధిస్తే 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ(BJP) అధికారంలోకి వచ్చినట్లు అవుతుంది. ఉదయం నుండి దేశవ్యాప్తంగా ప్రజలు ఈ ఫలితాలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి గెలుపు ఆమ్ ఆద్మీ పార్టీని వరించింది. కొండ్లీ నియోజకవర్గం (Kondli Assembly constituency) నుంచి ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్ (Kuldeep Kumar) విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి ప్రియాంక గౌతమ్‌ను 6,293 ఓట్ల తేడాతో ఓడించారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 12 రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యే సరికి, కుల్దీప్ కుమార్ తన ఆధిక్యాన్ని నిలబెట్టుకున్నారు.

Delhi New CM : కౌన్ బనేగా ఢిల్లీ సీఎం ? సీఎం రేసులో ఉన్న బీజేపీ నేతలు వీరే

ఢిల్లీ అసెంబ్లీ మొత్తం 70 స్థానాలకుగాను బీజేపీ అధిక్యంలో కొనసాగుతూ మెజారిటీ దిశగా దూసుకెళ్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ కొన్నిచోట్ల పోటీని తీవ్రంగా కొనసాగిస్తున్నా, బీజేపీ ముందంజలో ఉంది. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం ప్రజలను ఆకట్టుకునేలా పాలన అందించినా, అవినీతి ఆరోపణలు, ప్రతిపక్ష విమర్శలు ప్రజలపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ఓటర్లు ఆప్ ప్రభుత్వం పట్ల కొంత అసంతృప్తిగా ఉన్నప్పటికీ, కొందరు అభ్యర్థులు స్థానికంగా బలంగా నిలిచారు. కుల్దీప్ కుమార్ విజయం అందుకోవడం ఆమ్ ఆద్మీ పార్టీకి కొంత ఊరటనిచ్చే అంశం. అయితే మొత్తం ఫలితాల కౌంటింగ్ పూర్తయ్యే వరకు రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది. ఇక ఈ ఎన్నికలు ఢిల్లీలో కొత్త రాజకీయ సమీకరణాలకు నాంది కావొచ్చు. బీజేపీ గెలిస్తే ఆప్ పాలన ముగుస్తుందని స్పష్టమవుతోంది.

  Last Updated: 08 Feb 2025, 12:25 PM IST