Site icon HashtagU Telugu

Kozhikode – City of Literature : ‘సిటీ ఆఫ్ లిటరేచర్’‌గా కోజికోడ్.. ‘సిటీ ఆఫ్ మ్యూజిక్‌’గా గ్వాలియర్‌

Kozhikode City Of Literature

Kozhikode City Of Literature

Kozhikode – City of Literature : కేరళలోని కోజికోడ్ నగరాన్ని ‘సిటీ ఆఫ్ లిటరేచర్’‌గా యునెస్కో గుర్తించింది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ను  ‘సిటీ ఆఫ్ మ్యూజిక్‌’గా గుర్తించింది. యునెస్కోకు చెందిన క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్‌లో ఈ రెండు సిటీలకూ చోటు దక్కింది. దీంతో యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్ (యూసీసీఎన్) జాబితాలో ఉన్న నగరాల సంఖ్య 350కి పెరిగింది. ఈ నగరాలన్నీ 100 కంటే ఎక్కువ దేశాలకు చెందినవి. క్రాఫ్ట్స్, జానపద కళలు, డిజైన్, ఫిల్మ్, గ్యాస్ట్రోనమీ, సాహిత్యం, మీడియా కళలు, సంగీతం వంటి ఏడు సృజనాత్మక రంగాలలో విలసిల్లుతున్న నగరాలకు యూసీసీఎన్ జాబితా ప్రాతినిధ్యం వహిస్తుంది. సాహిత్యరంగంలో యూసీసీఎన్ జాబితాకు ఎంపికైన ఇంకొన్ని నగరాల్లో రియో డి జనీరో, తైఫ్, టుకుమ్స్, హోబర్ట్, లాసి, ఒకాయమా ఉన్నాయి. చలనచిత్ర రంగంలో యూసీసీఎన్ జాబితాకు ఖాట్మండు ఎంపికైంది.

We’re now on WhatsApp. Click to Join.

2024  సంవత్సరంలో జూలై 1 నుంచి 5 వరకు పోర్చుగల్‌లోని బ్రాగాలో జరిగే యూసీసీఎన్ వార్షిక సదస్సులో పాల్గొనడానికి ఈ నగరాలకు చెందిన ప్రతినిధులను ఆహ్వానించనున్నారు. ఈవిషయాన్ని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. భారత్‌‌కు ఇది గర్వకారణమని పేర్కొంటూ ట్వీట్ చేశారు. సంస్కృతిని కాపాడుకోవడంలో ఈ రెండు నగరాలు ఎంతో కృషి చేశాయని, ఆ నిబద్ధతే ఈ గుర్తింపునిచ్చిందని(Kozhikode – City of Literature) పేర్కొన్నారు. 

Also Read: iQOO: భారత మార్కెట్లోకి ఐక్యూ 12 స్మార్ట్‌ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే..?