Kovalam Leela Raviz: ప్రపంచంలోని టాప్- 20 హోటళ్లలో కోవలం లీలా రవిజ్ కి 8వ స్థానం.. జాబితాలో ఉన్న ఏకైక భారతీయ హోటల్ ఇదే..!

సహజమైన కోవలం (Kovalam) బీచ్ ఒడ్డున ఉన్న ది లీలా రావిజ్ (Leela Raviz) ఐకానిక్ హోటల్ ప్రపంచంలోని టాప్ 20 అంబాసిడర్ హోటల్స్ జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచింది.

  • Written By:
  • Updated On - April 20, 2023 / 02:27 PM IST

సహజమైన కోవలం (Kovalam) బీచ్ ఒడ్డున ఉన్న ది లీలా రవిజ్ (Leela Raviz) ఐకానిక్ హోటల్ ప్రపంచంలోని టాప్ 20 అంబాసిడర్ హోటల్స్ జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ చార్లెస్ కొరియా రూపొందించిన లీలా రావిజ్ ప్రతిష్టాత్మక ట్రావెల్ & లీజర్ మ్యాగజైన్ జాబితాలో ఉన్న ఏకైక భారతీయ హోటల్ ఇదే. కేరళకు చెందిన మిలియనీర్ వ్యాపారవేత్త రవి పిళ్లై నేతృత్వంలోని ఆర్‌పి గ్రూప్ యాజమాన్యంలోని హోటల్ స్వర్ణోత్సవం జరుపుకుంటున్న తరుణంలో ఈ అవార్డు వచ్చింది.

బిశ్వజిత్ చక్రవర్తి, జనరల్ మేనేజర్, కోవలం లీలా రవీజ్ మాట్లాడుతూ.. “కొత్త గుర్తింపు మెరుగైన సేవలను అందించడంలో మా బాధ్యతను పెంచుతుంది. ఈ విజయం లీలా రవీజ్‌కు ప్రయోజనం చేకూర్చడమే కాకుండా కేరళలో పర్యాటక పరిశ్రమకు కొత్త అవకాశాలకు తలుపులు తెరిచిందని ఆయన అన్నారు.ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ చార్లెస్ కొరియా 1969లో ఇండియన్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నేతృత్వంలో ఈ హోటల్ నిర్మాణాన్ని ప్రారంభించారు.

Also Read: Bear Falls Into Well: బావిలో పడిన ఎలుగుబంటి.. రెస్క్యూ చేసి కాపాడిన అధికారులు

కోవలంలోని అశోకా హోటల్‌ను 1972 డిసెంబర్ 17న అప్పటి ముఖ్యమంత్రి సి.అచ్యుత మీనన్ అధికారికంగా ప్రారంభించారు. ఈ హోటల్‌లో బస చేసిన వారిలో జాక్వెలిన్ కెన్నెడీ, విన్నీ మండేలా, సర్ పాల్ మెక్‌కార్ట్‌నీ, జాన్ కెన్నెత్ గల్‌బ్రైత్, ప్రొఫెసర్ వాట్సన్, డాక్టర్ అమర్త్యసేన్, JRD టాటా, దలైలామా తదితరులు ఉన్నారు. అశోకా హోటల్ కోవలంను 2002లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించింది. మొదట టి4 గ్రూప్, ఆ తర్వాత లీలా గ్రూప్ హోటల్ యాజమాన్యాన్ని చేజిక్కించుకున్నాయి.