Kolkata : 2010 తర్వాత జారీ అయిన ఓబీసీ సర్టిపికెట్ల పై కలకత్తా హైకోర్టు సంచల తీర్పు

OBC certificates : 2010 తర్వాత జారీ అయిన ఓబీసీ సర్టిఫికెట్ల(OBC certificates)ను రద్దు చేస్తూ.. కోలకత్తా హైకోర్టు(Kolkata High Court) ఈరోజు (బుధవారం) సంచలన తీర్పు ఇచ్చింది. 2012 నాటి పశ్చిమ బెంగాల్‌ వెనుకబడిన వర్గాల చట్టంలోని కొన్ని నిబంధనలు చట్టవిరుద్ధంగా ఉన్నాయంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే వీటిపై విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం 2010-12 మధ్య రాష్ట్ర ప్రభుత్వం ఓబీసీ వర్గీకరణలుగా పేర్కొన్న 42 క్లాసులను కొట్టివేస్తున్నట్లు వెల్లడించింది. We’re now on […]

Published By: HashtagU Telugu Desk
Kolkata High Court Cancels All OBC Certificates Issued In West Bengal After 2010

Kolkata High Court Cancels All OBC Certificates Issued In West Bengal After 2010

OBC certificates : 2010 తర్వాత జారీ అయిన ఓబీసీ సర్టిఫికెట్ల(OBC certificates)ను రద్దు చేస్తూ.. కోలకత్తా హైకోర్టు(Kolkata High Court) ఈరోజు (బుధవారం) సంచలన తీర్పు ఇచ్చింది. 2012 నాటి పశ్చిమ బెంగాల్‌ వెనుకబడిన వర్గాల చట్టంలోని కొన్ని నిబంధనలు చట్టవిరుద్ధంగా ఉన్నాయంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే వీటిపై విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం 2010-12 మధ్య రాష్ట్ర ప్రభుత్వం ఓబీసీ వర్గీకరణలుగా పేర్కొన్న 42 క్లాసులను కొట్టివేస్తున్నట్లు వెల్లడించింది.

We’re now on WhatsApp. Click to Join.

అంతేకాక, పశ్చిమ బెంగాల్‌(West Bengal) వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల చ‌ట్టం 1993కు అనుగుణంగా రాష్ట్ర బీసీ క‌మిష‌న్(State BC Commission) ఓబీసీల తాజా జాబితా రూపొందించాల‌ని కోర్టు ఆదేశించింది. 2010 త‌ర్వాత త‌యారుచేసిన ఓబీసీ జాబితా చ‌ట్ట‌విరుద్ధ‌మ‌ని హైకోర్టు బెంచ్ స్ప‌ష్టం చేసింది. ప‌శ్చిమ బెంగాల్ వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల చ‌ట్టం, 2012లోని సెక్ష‌న్ 2హెచ్‌, 5,6, సెక్ష‌న్ 16, షెడ్యూల్ 1, షెడ్యూల్ 3లు రాజ్యాంగ‌విరుద్ధ‌మ‌ని కొట్టివేసింది.

Read Also: Water After Meal : భోజనం చేసిన వెంటనే నీళ్లెందుకు తాగకూడదు?

కాగా, 2010 తర్వాత జారీ చేసిన ఓబీసీ సర్టిఫికెట్లు(OBC Certificates) అన్నీ 1993 (బీసీ కమిషన్‌) చట్టాన్ని ఉల్లంఘించి జారీ చేశారని పిటిషన్‌ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. వాస్త‌వంగా వెనుక‌బ‌డిన త‌ర‌గతుల వారికి ద‌క్కాల్సిన స‌ర్టిఫికెట్లు వారికి ల‌భించ‌లేద‌ని పేర్కొంది. కోర్టు ఆదేశాల‌తో 2010 త‌ర్వాత జారీ చేసిన అన్ని ఓబీసీ స‌ర్టిఫికెట్లు ర‌ద్ద‌య్యాయి. కాగా, 2010కి ముందు జారీ చేసిన ఓబీసీ స‌ర్టిఫికెట్ల‌పై తీర్పు ప్ర‌భావం ఉండ‌దు.

 

 

  Last Updated: 22 May 2024, 08:44 PM IST