Site icon HashtagU Telugu

Calcutta High Court : మమతా బెనర్జీ పై కోల్‌కతా హైకోర్టు ఆగ్రహం

Kolkata High Court angry with Mamata Banerjee

Kolkata High Court angry with Mamata Banerjee

Calcutta High Court: ఆర్‌జీ కార్‌ మెడికల్ కాలేజీ ఆసుపత్రి ఆవరణలో నిన్న జరిగిన విధ్వంస ఘటనపై కోల్‌కతా హైకోర్టు మమతా బెనర్జీ ప్రభుత్వం(Mamata Banerjee Govt)పై మండిపడింది. పశ్చిమబెంగాల్‌లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యమైందనేందుకు ఈ ఘటన నిదర్శనమని కోల్‌కతా హైకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఈ దాడి ఘటనకు సంబంధించిన నివేదికను వెంటనే సమర్పించాలని అటు పోలీసులను ఇటు ఆసుపత్రి ఉన్నతాధికారులను శుక్రవారం కోల్‌కతా హైకోర్టు ఆదేశించింది. దాదాపు 7 వేల మంది గుంపుగా ఆసుపత్రిపై దాడికి తెగబడితే.. పోలీసుల నిఘా వైఫల్యాన్ని సూచిస్తుందని కోల్‌కతా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్. శివజ్ఞానం అభిప్రాయపడ్డారు. ఆసుపత్రి వద్ద పోలీసు బలగాలున్నా ఈ విధంగా జరగడం ఏమిటని ప్రశ్నించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇలా అయితే వైద్యులు భయపడకుండా ఏలా పని చేయగలుగుతారని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమని జస్టిస్ టి.ఎస్. శివజ్ఞానం స్పష్టం చేశారు. ఏ కారణం చేతనైనా క్రిమినల్ ప్రొసిజర్ కోడ్ ఆర్డర్‌లోని సెక్షన్ 144ని పాస్ చేస్తారని ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ప్రశ్నించారు. ఇంత ఘర్షణ జరుగుతున్నప్పుడు.. ఆ ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టి ఉండాల్సిందని జస్టిస్ టి.ఎస్. శివజ్ఞానం పేర్కొన్నారు. ఇక ఆసుపత్రిపై దాడి చేసిన దాదాపు ఏడు వేల మంది నడిచి వచ్చారా? అని ఈ సందర్భంగా జస్టిస్ టి.ఎస్. శివజ్ఞానం సందేహం వ్యక్తం చేశారు. తదుపరి విచారణ ఆగస్ట్ 21వ తేదీ.. మధ్యంతర నివేదిక ఆందజేయాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది.

ఈ కేసు తదుపరి విచారణ ఆగస్ట్ 21వ తేదీన జరుగుతుందని జస్టిస్ టి.ఎస్. శివజ్జానం స్పష్టం చేశారు. ఆ రోజు.. ఈ దాడి వ్యవహారంపై వేర్వేరుగా అఫిడవిట్ దాఖలు చేయాలని పోలీసులు, ఆసుపత్రి ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ దాడికి దారి తీసిన పరిస్థితులను డ్యాకుమెంట్ రూపంలో అందజేయాలని పోలీసులను ఈ సందర్భంగా హిరణ్మయి భట్టాచార్య కోరారు. అలాగే ఆగస్ట్ 9వ తేదీన ఆర్ జీ కార్ ఆసుపత్రిలో హత్యాచారానికి గురైన ట్రైయినీ వైద్యురాలి కేసు దర్యాప్తునకు సంబంధించిన మధ్యంతర నివేదిక అందజేయాలని ఈ సందర్భంగా సీబీఐని సైతం కోల్‌కతా హైకోర్టు ఆదేశించింది.

Read Also: IPL 2025: గాయపడ్డ సింహాలు వస్తున్నాయి