పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ కోల్‌కతా లా కాలేజీలో చోటుచేసుకున్న సామూహిక అత్యాచారం (Law college student gang-raped) ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతోంది. లా చదువుతున్న ఓ విద్యార్థినిపై ముగ్గురు వ్యక్తులు కలిసి అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన జూన్ 25 రాత్రి జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు మూడు గంటల పాటు నరకయాతనకు గురిచేసినట్లు గుర్తించారు. నిందితుల్లో ఇద్దరు విద్యార్థులు, ఒకరు కాలేజీ పూర్వ విద్యార్థి కాగా, ప్రధాన నిందితుడు మనోజిత్ మిశ్రా, తృణమూల్ కాంగ్రెస్‌కి చెందిన విద్యార్థి విభాగం (TMCP) నేతగా ఉన్నాడు. పోలీసులు ముగ్గురినీ అరెస్ట్ చేసి, వారి ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
India vs England: ఇంగ్లాండ్‌తో రెండో టెస్ట్‌కు ముందు టీమిండియాలో భారీ మార్పులు?!
బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. మనోజిత్ మిశ్రా గతకొంతకాలంగా తాను ప్రేమిస్తున్నానని, తాను ప్రేమించకపోయినా పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నాడు. తాను నిరాకరించడంతో, తన లవర్‌కు హాని చేస్తానని బెదిరించాడు. అనంతరం ప్రేమికుడిని కాలేజీలో బంధించి, ఆమెను సెక్యూరిటీ గార్డు రూమ్‌కు తీసుకెళ్లి ముగ్గురు కలిసి అత్యాచారం చేశారు. తీవ్ర భయంతో కాళ్లు మొక్కినా కనికరించలేదు. అంతే కాదు తనఫై జరిగిన అఘాయిత్యాన్ని వీడియో తీశారు. ఈ వీడియో బయట పెడతామని బెదిరించారని , బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా హాకీ స్టిక్‌తో దాడి చేసినట్లు వివరించింది.
ఈ దారుణ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇది లా కళాశాలలో జరిగిన ఘటన కావడంతో, విద్యా ప్రాంగణాల్లో మహిళల భద్రతపై చర్చ మొదలైంది. కోల్‌కతా పోలీసు కమిషనర్‌కు లేఖ రాసిన మహిళా కమిషన్, బాధితురాలికి న్యాయసహాయం, వైద్య సహాయం కల్పించాలని సూచించింది. ముగ్గురు రోజుల్లోగా ఈ కేసుపై పూర్తి నివేదిక ఇవ్వాలని కోరింది. నిందితులకు కఠిన శిక్షలు విధించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని దేశవ్యాప్తంగా పిలుపులు వస్తున్నాయి. బాధితురాలి ప్రశ్న – “పెళ్లి నిరాకరించడమే నేరమా?” అన్నది సమాజానికి గుణపాఠంగా మారుతోంది.