Site icon HashtagU Telugu

Kolkata Doctor Rape-Murder: యువ వైద్యురాలిపై హ‌త్యాచారం కేసు.. ప‌లు కీల‌క విష‌యాలు వెల్ల‌డి..!

Kolkata Doctor Rape-Murder

Kolkata Doctor Rape-Murder

Kolkata Doctor Rape-Murder: కోల్‌కతా అత్యాచారం-హత్య కేసు (Kolkata Doctor Rape-Murder) బాధితురాలి సహచర వైద్యులు బాధితురాలి గురించి తెలిసిన‌వారే ఆమెను లక్ష్యంగా చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆగస్టు 9న ఆసుపత్రిలోని సెమినార్ హాల్‌లో మహిళా డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య చేశారు. ఆగస్టు 9వ తేదీ రాత్రి కోల్‌కతాకు చెందిన బాధితురాలు విశ్రాంతి కోసం సెమినార్ హాల్‌కు వెళ్లింది. కొన్ని గంటల తర్వాత బాధితురాలి మృతదేహం లభ్యమైంది. తనపై పని ఒత్తిడి ఎక్కువగా ఉందని, ఒక్కోసారి ఏకంగా 36 గంటల పాటు పని చేయాల్సి వస్తోందని బాధితురాలి డైరీ వెల్లడించింది.

బాధితురాలిపై కుట్ర

బాధితురాలి తోటి వైద్యులు చాలా మంది టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. పోస్టింగ్, షిఫ్ట్‌లు వంటివి ఆసుపత్రిలో చాలా సాధారణం. బాధితురాలి సహోద్యోగి మాట్లాడుతూ.. ఆమె మరణం సాధారణ అత్యాచారం, హత్య కేసు కాదు. బాధితురాలు సెమినార్ హాల్‌లో ఒంటరిగా ఉన్న విషయం నిందితుడు సంజయ్‌రాయ్‌కు ఎలా తెలిసిందని ఆయన ప్రశ్నించారు. నిందితుడు సంజయ్ రాయ్ పెద్ద కుట్రలో భాగమై ఉండవచ్చని సహోద్యోగి డాక్టర్ చెప్పారు.

Also Read: Nirmal Bus Accident: నిర్మల్‌లో రన్నింగ్ బస్సు టైర్లు ఊడిపోవడంపై కేటీఆర్ ఫైర్

సహోద్యోగి మాట్లాడుతూ.. ‘ఇది సాధారణ అత్యాచారం, హత్య కేసు కాదని మేము అనుమానిస్తున్నాం. బాధితురాలిపై దాడి జరిగింది ఆసుపత్రిలోని సెమినార్ హాల్‌లో..? బాధితురాలు ఒంటరిగా ఉందని నిందితులకు ఎలా తెలిసింది? అని ప్ర‌శ్నించారు.

ఆసుపత్రిలో డ్రగ్స్‌ రాకెట్‌పై చర్చ

బాధితురాలి సహోద్యోగి మాట్లాడుతూ.. బాధితురాలి విభాగంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా రాకెట్ గురించి చర్చ జరిగింది. ఆమె దానిని బహిర్గతం చేయడానికి ప్రయత్నిస్తోందని తెలిపారు. బాధితురాలి మృతిపై సమాచారం అందుకున్న ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా ఆర్జీ కర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపాల్‌ను సీబీఐ శనివారం వరుసగా రెండో రోజు విచారించింది. నివేదికల ప్రకారం.. హత్య వార్త తెలిసినప్పుడు అతని మొదటి స్పందన ఏమిటని ఏజెన్సీ మాజీ ప్రిన్సిపాల్‌ని అడిగింది. ఆర్‌జి కర్ ఆసుపత్రిలో మహిళా వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటన తెల్ల‌వారుజామున‌ 3 నుండి 5 గంటల మధ్య జరిగింది. మహిళా వైద్యురాలి ప్రైవేట్‌ భాగాలపై దాడి చేసి ఆమె గొంతుకోసి చంపేశారని పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడించింది. నివేదిక ప్రకారం.. డాక్టర్ కళ్ళు, నోరు, ప్రైవేట్ భాగాల నుండి రక్తస్రావం జరిగింది.

Exit mobile version