Site icon HashtagU Telugu

Kitchen Essentials Price Hike : పండగ వేళ కొండెక్కిన వంట సామాను ధరలు..పిండివంటలు లేనట్లేనా..?

Kitchen Essentials Price Hike

Kitchen Essentials Price Hike

ప్రస్తుతం మార్కెట్ లో ఏం కొనాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సిన రోజులు వచ్చాయి. ఏమి కోనేటట్టు లేదు.. ఏమి తినేటట్టు లేదు.. అన్న చందగా మారింది సగటు మనిషి బతుకు. రోజు మారితే ఏ ధరలు (Price) ఎంత పెరిగాయో తెలుసుకోవాల్సిన రోజులు వచ్చాయి. అన్ని నిత్యవసరాల ధరలు ఆకాశానికి తాకుతున్నాయి. ఇటు చూసి అటు చూసే వరకే రేట్లు పెరుగుతున్న వైనం. పెరుగుతున్న రేట్లతో పేద వారి బతుకు మరింత భారంగా మారుతుంది.

We’re now on WhatsApp. Click to Join.

మొన్నటి వరకు కూరగాయలు (Vegetable Price Hike) అనుకుంటే..ఇప్పుడు వంట సామాను (Kitchen Essentials Price Hike) ధరలు కొండెక్కి కూర్చున్నాయి. అసలే పండగ వేళ…ఈ పండగ వేళ నాల్గు పిండివంటలు చేసుకుందామని అనుకున్న సామాన్యుడిపై ఇప్పుడు ధరల భారం భారీగా పడుతుంది. పిండి, నూనె కాకుండా, వంటగదికి సంబంధించిన ప్రతి వస్తువు ధరలు పెరిగాయి. జీలకర్ర కిలో రూ. 800కి చేరగా, ఎర్ర మిర్చి, పసుపు, గరం మసాలా ధరలు కూడా పెరిగాయి. చక్కెర కూడా ఖరీదుగా మారి కిలో రూ.44కు చేరింది. ద్రవ్యోల్బణం ప్రభావంతో పప్పుల ధరలు కూడా పెరిగాయి. మార్కెట్ లో ఈ పెరుగుదల చూసి సామాన్య ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఏమీకొనాలి..ఏం తినాలి..ఎలా పండగ చేసుకోవాలి అని బాధపడుతున్నారు.

పెరిగిన వస్తువుల ధరలు చూస్తే (Kitchen Essentials Price Hike)..

ఎర్ర మిర్చి – కేజీ రూ. 300
పసుపు – కేజీ రూ.160
జీలకర్ర – కేజీ రూ. 1200
నల్ల మిరియాలు – కేజీ రూ.800
చక్కెర – కేజీ రూ.44
పప్పు – కేజీ రూ.90
శనగలు – కేజీ రూ.120
మస్టర్డ్ ఆయిల్ – కేజీ రూ.110
చిన్న ఏలకులు – కేజీ రూ.3000

Read Also :  PM Modi: మోడీ పర్యటనపై కుట్ర పన్నిన కేసులో NIA దూకుడు