YSRTP అధినేత్రి వైస్ షర్మిల (Sharmila) నేడు తన పార్టీ (YSRTP) ని కాంగ్రెస్ (Congress) లో విలీనం చేసి..కాంగ్రెస్ గూటికి చేరారు. ఢిల్లీ వేదికగా జరిగిన కార్యక్రమంలో రాహుల్ , మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ..వైఎస్సార్ బిడ్డగా వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నందుకు సంతోషంగా ఉందని వైఎస్ షర్మిల తెలిపారు. వైఎస్సార్టీపీ నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్ లో విలీనం అవుతున్నారని ఆమె పేర్కొన్నారు. తన తండ్రి వైఎస్ బతికుండగా కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేశారని, అందులోనే ఆయన అసువులుబాశారని షర్మిల గుర్తుచేశారు.
We’re now on WhatsApp. Click to Join.
వైఎస్సార్ బిడ్డగా తిరిగి కాంగ్రెస్ లో చేరుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. దేశ సెక్యులర్ పునాదుల్లో భాగమైన కాంగ్రెస్ పార్టీలో తాను భాగమవుతున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత అప్పగించినా నిబద్ధతతో పనిచేస్తానని వైఎస్ షర్మిల తెలిపారు. తాను వైఎస్సార్ అడుగు జాడల్లో నడుస్తున్నట్లు షర్మిల తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలన్నది తన తండ్రి వైఎస్సార్ కల అని, దాన్ని నెరవేర్చే యత్నంలో తాను భాగస్వామిని అవుతున్నందుకు షర్మిల సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో ప్రతీ ఒక్కరి ఆకాంక్షలు నెరవేరుస్తుందన్న నమ్మకం తనకు ఉందన్నారు.
ఇక షర్మిల వ్యాఖ్యలకు కేంద్రమంత్రి , బిజెపి నేత కిషన్ రెడ్డి (Kishan Reddy Reacts) కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు దేశప్రజలు అందుకు సుముఖంగా లేరన్నారు. షర్మిలాగానీ, మరెవరో గానీ రాహుల్ ను ప్రధాని చేయలేరని… ఎవరైనా ప్రధానమంత్రి కావాలంటే ప్రజలు చేయాల్సిందేన్నారు. రాహుల్ గాంధీ ఒక పొలిటీషియన్ అని..ఆయన ఫార్ములా ఫెయిల్యూర్ అవుతుందని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
Read Also : Pawan Kalyan Divorce Once Again : పవన్ కళ్యాణ్ మరోసారి విడాకులు తీసుకోబోతారని బాంబ్ పేల్చిన జ్యోతిష్యుడు